మేధావి ముసుగులో అడ్డగోలు రాజకీయాలు చేసే చేత కాని రాజకీయ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న గురించి కించ పరిచే మాటలు అసువుగా మాట్లాడేస్తున్నారు. కాంగ్రెస్ రక్తాన్ని తమ ఒంటి నిండా నింపుకున్న ఈ మేధావులంతా తమ మేధావితనం మసుగులో దేశాన్ని కించ పర్చడానికి క్షణం కూడా ఆలోచించరు. దేశద్రోహుల పార్టీగా కాంగ్రెస్ పార్టీని ఎప్పటికప్పుడు ప్రజల ముందు దోషిగా నిలబెడుతూనే ఉంటారు.
భారత్ రత్న వల్ల టోల్ చార్జీలు ఉండవట !
టోల్ గేట్ల వద్ద భారతరత్న అవార్డులు పొందిన వారికి టోల్ చార్జీలు ఉండవని.. భారత రత్న అవార్డు దానికి తప్ప దేనికీ పనికి రాదని ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. భారత దేశ ప్రజలందరూ అత్యున్నతంగా కీర్తించి ఇచ్చే పురస్కారం భారత రత్న. ప్రణబ్ ముఖర్జీకి ఇచ్చినప్పుడు ఈ మేధావులంతా గొప్పగా పొగిడారు. నిజానికి ఆయనను గుర్తించింది కూడా బీజేపీ ప్రభుత్వమే. అయినా ఉండవల్లి అరుణ్ కుమార్ మాత్రం ఇప్పుడు భారత రత్నను.. టోల్ చార్జీల మినహాయింపునకు ఓ మార్గంగా చెప్పడం అందర్నీ కించ పర్చడమే. దేశాన్ని అవమానించడమే.
మేధావి తనం ముసుగులో దేశాన్ని కించపర్చడం ఎందుకు ?
ఉండవల్లి అరుణ్ కుమార్ ఎంత మేధావో అందరికీ తెలుసు. మేధావి పేరుతో లాయర్ లాజిక్కుల ప్రశ్నలు వేసి తనను తాను గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. నిజానికి ఆయన మేధావి తనం భరించలేక.. ఆయన సలహాల వల్ల మునిగిపోయిన వాళ్లు దండం పెట్టేశారు. అందుకే ఇప్పుడు ఆయనకు ఏ పార్టీలోనూ చాన్స్ లేదు. కాంగ్రెస్ పార్టీ బ్లడ్ కాబట్టి కించ పరుస్తూనే ఉంటారు. వారికి దేశాన్ని అవమానించడం అనేది చిన్న విషయం.
నకిలీ గాంధీ ఫ్యామిలీలోని రత్నాలకూ వర్తిస్తుందా అని విష్ణువర్ధన్ రెడ్డి సూటి ప్రశ్న
భారత రత్న పురస్కారంపై ఉండవల్లి చేసిన వ్యాఖ్యలను ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఉండవల్లి అన్న మాటలు.. గాంధీ ఫ్యామిలీలోని నెహ్రూ, ఇందిరా గాందీ, రాజీవ్ గాంధీలకు వర్తిస్తుందా అని సూటిగా ప్రశ్నించారు. వారికి వారు తాము అధికారంలో ఉండగా.. కాంగ్రెస్ భారతరత్నాలు ప్రకటించుకుంది. కానీ బీజేపీ.. దేశంలో అత్యంత ప్రతిభావంతుల్ని..దేశ గతిని మార్చిన వారికి భారతరత్నాలను ప్రకటిస్తోంది.. ఉండవల్లి వ్యాఖ్యలు గాంధీ కుటుంబానికి వర్తింప చేయాలన్న సెటైర్లు గట్టిగానే వినిపిస్తున్నాయి.