మాట్లాడే అమ్మవారు – దేవుడున్నాడు అనేందుకు ఇదే నిదర్శనం!

ఉలుకు, పలుకు లేకుండా ఎవరైనా అలాగే సైలెంట్ గా ఉండిపోతే..ఏంటి రాయిలా స్పందించవ్ అంటారు. మరి రాళ్లే మాట్లాడితే.. ఇది సాధ్యమా అని సందేహపడొద్దు. దేవుడు మాట్లాడుతాడా? రాళ్లకు పూజలెందుకు అనేవారికి ఇదే సమాధానం…

మనదేశంలో ప్రతి ఆలయానికి ఓ విశిష్టత ఉంది. కొన్ని ఆలయాల్లో సైన్స్ కి అందని రహస్యాలెన్నో ఉన్నాయి. శాస్త్రవేత్తలు రంగంలోకి దిగి పరిశోధనలు చేసినా అక్కడ ఏంజరుగుతోంది అనేది అంతుపట్టకుండా ఇప్పటికీ రహస్యాలుగానే మిగిలిపోయాయి. అలాంటి ఆలయాల్లో ఒకటి బీహార్ రాజధాని పాట్నా బస్తర్ లో ఉన్న రాజేశ్వరీ ఆలయం. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అమ్మవారు మాట్లాడతారట. స్వయంగా అమ్మవారి విగ్రహం నుచి మాటలు వినిపిస్తాయి.

రాత్రి వేళ మాట్లాడే విగ్రహాలు
400 ఏళ్లక్రితం ఈ ఆలయాన్ని తాంత్రిక భవానీ మిశ్రా నిర్మించారు. ఇక్కడ రాజ రాజేశ్వరి త్రిపుర సుందరి దేవి ప్రధాన విగ్రహమే కాకుండా ఆలయప్రాంగణంలో బతుకు బహీరవ, దత్తాత్రే భైరవ, అన్నపూర్ణ భైరవ, కాల భైరవ, మంగండి భైరవలతో పాటు దేవతలైన బగులముఖి, తారా విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలోని ఉన్న విగ్రహాలు రాత్రిసమయంలో మాట్లాడుకుంటాయని భక్తుల విశ్వాసం. కొందరు ఇది మూఢనమ్మకం అని కొట్టిపడేసినా ఆలయంలోపల నుంచి వచ్చే వింత శబ్దాలేంటన్నది ఇప్పటికీ అంతుచిక్కకపోవడం ఈ ప్రచారానికి మరింత ఊపు ఇచ్చింది.

శాస్త్రవేత్తలకి అంతు చిక్కలేదు
ఆలయాన్ని నిర్మించిన తాంత్రిక భవానీ మిశ్రా వంశస్తులే ఈ ఆలయంలో పూజారులుగా ఉన్నారు. ఓసారి అర్థరాత్రి సమయంలో ఆలయంలోపలకు వెళ్లి చూడగా అమ్మవారి విగ్రహం నుంచి ఏదో తెలియని శబ్దాలు వచ్చాయట. అవేంటని వాళ్లకి అర్థంకాలేదు, తెలుసుకునేందుకు వెళ్లిన వైజ్ఞానిక వేత్తలు కూడా విగ్రహాలు నుంచి శబ్దాలు వస్తున్నట్లు ధృవీకరించినా అదెలా వస్తున్నాయన్నది చెప్పలేకపోయారు. కేవలం ఈ ఆలయాన్ని తాంత్రిక పూజల కోసం ప్రత్యేకంగా నిర్మించి ఉంటారని…తాంత్రిక శక్తి వల్లే ఇలా జరుగుతోందని స్థానికుల విశ్వాసం…

గమనిక: పండితులు చెప్పినవి, కొన్ని పుస్తకాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా రాసిన కథనం. దీనిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.