వైసీపీలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలకంగా ఎదిగారు. ఆయనకు ఎంపీ .. ఆయన కుమారుడుకు ఎమ్మెల్యే టిక్కెట్ తెచ్చుకున్నారు పెద్దిరెడ్డి పుంగనూరు ఎంఎల్‌ఎగా, కొడుకు రాజంపేట ఎంపిగా పోటీచేసి గెలుపొందారు. అదే కోవలో చంద్రగిరి ఎంఎల్‌ఎ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఒంగోలు ఎంపి అభ్యర్థిగా, తనయుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి చంద్రగిరి ఎంఎల్‌ఎ అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. ఎన్నికల్లో పోటీ చేయబోనని, తన కొడుకును తన వారసుడుగా అసెంబ్లీలోకి పంపించాలని చెవిరెడ్డి కోరినట్లుగా తెలుస్తోంది. అసలు విషయం ఆయన ఎంపీగా పోటీ చేయడం.
ఒంగోలు వైసీపీ అభ్యర్థిగా చెవిరెడ్డి
ఒంగోలులో వైసిపి రాజకీయ పరిణామాల మార్పుల్లో ఊహించని రీతిలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఎంపి అభ్యర్థిగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. రెండుసార్లు 2014, 2019లో చంద్రగిరి ఎంఎల్‌ఎగా గెలుపొందిన చెవిరెడ్డి 2014లో వైసిపి ప్రతిపక్షంగా ఉన్నపుడు జగన్‌కు మద్దతుగా అనేక పోరాటాలు చేసి దాదాపు 80కి పైగా కేసులు పెట్టించుకుని నమ్మినబంటుగా వ్యవహరించారు. 2019లో జగన్ అధికారంలోకి రావడంతో చెవిరెడ్డికి మంత్రి పదవి వస్తుందని అందరూ ఊహించారు. అయితే నాలుగేళ్ల పాటు ప్రభుత్వ విప్‌గా, టిటిడి బోర్డు మెంబర్‌గా తుడా ఛైర్మన్‌గా మూడు పదవుల్లోనూ తనదైన ముద్ర వేసుకుని ఉన్నారు.
విజయసాయిరెడ్డి బాధ్యతల్లోకి చెవిరెడ్డి
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాజకీయ సలహాదారుగా రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డి కీలకంగా ఉన్నారు. విజయ సాయిరెడ్డికి వయస్సు పైబడడంతో రానున్న 2024 ఎన్నికల్లో ఆయనను తప్పించి చెవిరెడ్డిని ఆ పదవిలో ఉంచుతారని చర్చ నడిచింది. ఈ నేపథ్యంలోనే ఏడాది క్రితమే తన కొడుకు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని చంద్రగిరి ఎంఎల్‌ఎ అభ్యర్థిగా ప్రకటించారు. తుడా ఛైర్మన్ పదవిని కొడుకుకు వారసత్వంగా ఇచ్చేశారు. తుడా ఛైర్మన్ కావడంతో టిటిడి బోర్డులోనూ చోటు దక్కింది. మోహిత్‌రెడ్డి ఎంపిపి పదవికి రాజీనామా చేశారు. వైసిపిగా ఉన్న యశోదను ఎంపిపిగా ప్రకటించారు. అయితే ఒంగోలులో వైసిపి రాజకీయ పరిణామాల్లో ఎంపిపిగా ఉన్న మాగుంట శ్రీనివాస్‌రెడ్డిని తప్పించి, ఆ స్థానాన్ని చెవిరెడ్డికి ప్రకటించారు. దీంతో ఒంగోలుకు ‘చెవిరెడ్డి’ వలస వెళ్లనున్నారు.
వైసీపీలో కీలకమైన నేత
వైసీపీలో కొంత మంది నేతలు పవర్ ఫుల్ గా ఉంటారు. అలాంటి వారిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒకరు. ఈసారి పుంగనూరు ఎంఎల్‌ఎ అభ్యర్థిగా మంత్రి పెద్దిరెడ్డి పోటీలో ఉండగా, కొడుకు రాజంపేట ఎంపిగానే బరిలో ఉండనున్నారు.పెద్దిరెడ్డి హ వా చిత్తూరుకే పరిమితం కానీ చెవిరెడ్డి మాత్రం రాష్ట్రం మొత్తం తన ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది.