దక్షిణాది ని దేశం నుంచి వేరు చేయడానికి క్రమంగా కుట్ర జరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ ఎంపీ.. కర్ణాటక డిప్యూటీ సీఎం సోదరుడు నేరుగా పార్లమెంట్ లో నే ఈ వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని విభజించాలన్నారు. తమకు అడిగిన్ని నిధులు ఇవ్వడం లేదని ఆయన డిమాండ్ చేయడంతో అందరిలోనూ విస్మయం వ్యక్తమయింది.
పార్లమెంట్ లోనే విభజన బీజాలు నాటే కుట్ర
బడ్జెట్ కేటాయింపుల్లో తమకు అన్యాయం జరుగుతున్నదనీ, ఇదే కొనసాగితే.. దక్షిణాది రాష్ట్రాలలో ప్రత్యేక దేశం ఏర్పాటుచేయాలనే డిమాండ్ రావొచ్చని కాంగ్రెస్ ఎంపీ డికె సురేష్ పార్లమెంట్‌లో వ్యాఖ్యానించారు. దీనిపై ఉభయ సభల్లోనూ తీవ్ర దుమారం చెలరేగింది. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని రాజ్యసభలో పీయూష్ గోయల్ డిమాండ్ చేశారు. దేశాన్ని ఒక్కటిగా ఉంచాలనేదే కాంగ్రెస్ సిద్ధాంతమని, విభజన కోరే వారికి పార్టీ ఎప్పటికీ మద్దతు తెలపదని ఖర్గే స్పష్టం చేశారు. డీకే సురేష్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలనీ, ఆయనపై పార్టీ తక్షణం చర్యలు తీసుకోవాలని లోక్‌సభలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి డిమాండ్ చేశారు.
డీకే సురేష్ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకమే
నిధుల కేటాయింపుల విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు దక్షిణాది రాష్ర్టాలపై పూర్తి వివక్ష చూపిస్తున్నదని కాంగ్రెస్ ఉద్దేశపూర్వక ఆరోపణలు చేసినట్లుగా కనిపిస్తోంది. గ్రాంట్లలో వివక్ష ఇలాగే కొనసాగితే దక్షిణ భారతీయులు ప్రత్యేక దేశం కోసం గళం విప్పడం అనివార్యమవుతుందని హెచ్చరించారు. కేంద్ర నిధుల్లో మా వాటా మాకు అందడం లేదు. మా డబ్బును ఉత్తర భారతానికి ఇస్తున్నారు. దక్షిణాది రాష్ర్టాలకు అన్ని విషయాల్లోనూ కేంద్రం అన్యాయం చేస్తున్నది. హిందీ వాళ్లు మాపై పెత్తనం చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. ఇదంతా ప్రజల్లో విష బీజాలు నాటే ప్రయత్నమని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. కాంగ్రెస్ హైకమాండ్ కు తెలిసే జరిగిందని అనుమానిస్తున్నారు.
ఉత్తరాది ప్రజల ఆదరించరని దక్షిణాదిని విడగొట్టి రాజకీయం చేయాలనుకుంటున్నారా ?
ఉత్తరాదిలో కాంగ్రెస్ నిర్వీర్యమైపోయింది. మళ్లీ ప్రజలు ఆదరిస్తారన్న గ్యారంటీ లేదు. అందుకే ఇక్కడ దక్షిణాది ప్రజల్ని రెచ్చగొట్టి విడిపోయేలా చేసి అధికారంలోకి రావాలనుకుంటోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలికాలంలో దక్షిణాదికి నిధులు అందడం లేదని.. పదవులు ఇవ్వడం లేదని.. లోక్ సభ సీట్లు తగ్గిస్తారని ప్రచారం చేస్తున్నారు. ఇదంతా కుట్ర ప్రకారమే జరుగుతోంది.దేశాన్ని విభజించాలనే రాజకీయాలు చేసే వారికి దేశంలో చోటు లేనట్లేన్న వాదన వినిపిస్తోంది.