ఒత్తైన కురుల కోసం కొబ్బరి నీళ్లు!

గ్లాస్ కొబ్బరి నీరు ఓ పూట భోజనంతో సమానం అంటారు ఆరోగ్యనిపుణులు. అయితే కొబ్బరి నీరు ఆరోగ్యానికే కాదు కేశ సౌందర్యానికి కూడా అద్భుతంగా పనిచేస్తుందని తెలుసా..

జుట్టు మెరిసిపోతుంది
కొబ్బరి నీరు పోషకాలున్న పానీయం. ఈ నీటిలో చాలా ముఖ్యమైన ఖనిజాలు, ఎలక్ట్రోలైట్లు, సహజ చక్కెరలు, విటమిన్లు ఉన్నాయి. ఇవన్నీ కొబ్బరి నీళ్లలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఏజింగ్ లక్షణాలకు దోహదం చేస్తాయి. ఇది తాగేందుకు మంచి రుచిగా ఉండడమే కాదు…జుట్టు పోషణకు మాయిశ్చరైజింగ్‌గా పని చేస్తుంది. కొబ్బరి నీటిలో లారిక్ యాసిడ్, యాంటీమైక్రోబయల్ ఫ్యాటీ యాసిడ్‌ ఉంటాయి. ఇది మీ పొడి స్కాల్ప్‌ను తేమగా మార్చడంలో సహాయపడుతుంది. ఈ సహజ రిఫ్రెషర్ ఎలక్ట్రోలైట్స్, అమైనో ఆమ్లాలు, విటమిన్లు, మినరల్స్‌తో ఉంటుంది. ఇందులో పొటాషియం, సోడియం, మెగ్నీషియం ఉన్నాయి. ఇది మీ జుట్టు, స్కాల్ప్‌ను హైడ్రేట్ చేస్తుంది.

చుండ్రు నుంచి ఉపశమనం
కొబ్బరి నీటిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు దురద, పొడి స్కాల్ప్‌ ఇబ్బందిని తగ్గింస్తాయి. కొబ్బరి నీటిని తలకు పట్టించడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. కొబ్బరి నీళ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు దెబ్బతిన్న జుట్టును పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. జుట్టును బలోపేతం చేయడం ద్వారా నెత్తిమీద చర్మాన్ని ఉత్తేజపరిచే, కణాల పెరుగుదలను ప్రోత్సహించే గుణం కొబ్బరి నీళ్లకు ఉంటుంది. పోషకాల సమృద్ధి, మెరుగైన ప్రసరణతో పాటు, జుట్టు తంతువులను బలపరుస్తుంది.

జుట్టు బలంగా పెరుగుతుంది
మాయిశ్చరైజ్డ్ హెయిర్, హెల్తీ స్కాల్ప్ ద్వారా జుట్టు పెరుగుదలకు కొబ్బరి నీళ్లు సహాయపడతాయి. జుట్టును కడగడానికి కొబ్బరి నీటిని ఉపయోగిస్తే.. మీ జుట్టు కుదుళ్లు పునరుజ్జీవింపజేస్తుంది. జుట్టు మెుదటి నుంచి చివర్ల వరకు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. చివర్లు చిట్లడం మాయమై జుట్టు మృదువుగా తయారవుతుంది. ఇది స్కాల్ప్, జుట్టుకు పోషణనిస్తుంది. మూలాల నుంచి జుట్టును బలోపేతం చేస్తుంది. కొబ్బరి నీటిని నేరుగా అప్లై చేసుకోవచ్చు. కాసేపటి తర్వాత షాంపూ పెట్టుకోవచ్చు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.