ప్రభాస్-గోపీచంద్ మరోసారి..ఈ సారి శత్రువులుగా కాదు!

వరుస ఫ్లాపుల తర్వాత ‘స‌లార్’ రూపంలో సక్సెస్ అందుకున్నాడు ప్రభాస్. సీజ్ ఫైర్ టార్గెట్ 1000 కోట్లు పెట్టుకున్నా 700 కోట్ల వ‌సూళ్ల‌తో స‌త్తా చాటింది. ఇక ‘స‌లార్ -2’ అంతకు మించి ఉంటుందని ఫిక్సైపోయారు ఫ్యాన్స్. ఇలాంటి టైమ్ లో సలార్ 2 గురించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్…

బ్యాక్ టూ బ్యాక్ భారీ యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో థియేట‌ర్లు మోగిపోయే సలార్ లో డార్లింగ్ బెస్ట్ ఫ్రెండ్ గోపీచంద్ కూడా నటిస్తున్నాడన్నది లేటెస్ట్ అప్ డేట్. ఈ మేరకు కథలో అవసరమైన మార్పులు చేర్పులు చేస్తున్నాడట ప్రశాంత్ నీల్. అయితే గోపీచంద్ కి ఎలాంటి క్యారెక్టర్ ఆఫర్ చేస్తున్నారనేది ఇంకా క్లారిటీ లేదు. గోపీచంద్ ని ఓ రోల్ కోసం తీసుకోవాలన్నది కూడా ప్రభాస్ ఇచ్చిన ఐడియానే.

డార్లింగ్ -గోపీ బెస్ట్ ఫ్రెండ్స్
ప్రభాస్-గోపీచంద్ ఇద్దరూ ఇండస్ట్రీలో అడుగుపెట్టక ముందే స్నేహితులు. ఆ త‌ర్వాత ఇద్ద‌రి ఎంట్రీ ఒకేసారి జ‌రిగింది. ఒక‌రు హీరో అయితే మ‌రొక‌రు విల‌న్ అయ్యారు. వర్షం సినిమాలో ఇద్దరూ కలసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఈ కాంబోలో మూవీ రాలేదు. తాజాగా ప్రభాస్ ప్రపొజల్ తో గోపీచంద్ పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటివరకూ గోపీచంద్ పాన్ ఇండియా మూవీలో నటించలేదకు. ఇదే నిజమైతే గోపీ నటించబోయే పాన్ ఇండియా మూవీ ఇదే అవుతుంది. ఫ్రెండ్ కెరీర్ కోసం ప్రభాస్ ఈ నిర్ణయం తీసుకున్నాడనే టాక్ వినిపిస్తోంది.

పృథ్వీ ప్లేస్ లో గోపీ అనుకున్నారు
వాస్తవానికి సలార్ లో ప్రభాస్ స్నేహితుడిగా నటించిన పృథ్వీరాజ్ సుకుమారన్ ప్లేస్ లో మొదట గోపీచంద్ ని తీసుకోవాలని అనుకున్నాడట ప్రశాంత్ నీల్. పైగా వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన వర్షం బ్లాక్ బస్టర్ హిట్టైంది. అయితే ప్రశాంత్ నీల్ ప్రతిపాదన గోపీచంద్ వద్దన్నాడని టాక్. విలన్ గా నటిస్తే వరుసగా నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ వస్తాయనే ఆలోచనతో నో చెప్పాడట. ఇప్పుడు మరోసారి శౌర్యంగపర్వం కోసం గోపీచంద్ పేరు తెరపైకి వచ్చింది. మరి ఈ మూవీలో ప్రభాస్ స్నేహితుడిగా నటిస్తాడేమో అంటున్నారు. ఇంతకీ ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేవరకూ వెయిట్ చేయాలి…