కదిరిలో అయోధ్య సీతారాముల కళ్యాణం – భారీగా నిర్వహించేందుకు విష్ణువర్ధన్ రెడ్డి సన్నాహాలు !

దేశమంతా ఇప్పుడు అయోధ్య గురించే చర్చ. ఆ మాటకు వస్తే ప్రపంచం మొత్తం అయోధ్య గురించే మాట్లాడుకుంటోంది. అందరూ ఒకే సారి అయోధ్య వెళ్లకపోవచ్చు కానీ.. భక్తులు అంతా ఎవరి స్థాయిలో వారు అయోధ్య ప్రాణప్రతిష్ట వేడుక్లని చేసుకున్నారు. అయోధ్య రామునిపై అమితమైన భక్తి ఉన్న వారంతా తమ తమ పరిధిలోని ఆలయాల్లో వేడుకలు నిర్వహించారు. ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కదిరిలోని రామాలయంలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించారు. వాటికి కొనసాగింపుగా అత్యంత భారీగా అయోధ్య సీతరాముల కల్యాణం నిర్వహించాలని నిర్ణయించారు.

21వ తేదీన కదిరిలో కనీవినీ ఎరుగని రీతిలో అయోధ్య సీతారాముల కల్యాణ్

ఫిబ్రవరి 21వ తేదీన అయోధ్య సీతారాముల కల్యాణాన్ని అత్యంత భారీగా నిర్వహించాలని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి సంకల్పించారు. భక్త సమాజాన్ని కలుపుకుని పకడ్బందీగా ముహుర్తాన్ని ఖరారు చేశారు. దాదాపుగా 50 వేల మంది భక్తులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవానికి సంబంధించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇందు కోసం గ్రామ గ్రామానికి శ్రీరామరథం ద్వారా సమాచారం పంపుతున్నారు. ఈ శ్రీరామ రథాన్ని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నుంచి సేవా భారతి పట్టణ ప్రముఖులతో కలిసి విష్ణువర్ధన్ రెడ్డి ప్రారంభించారు.

అధ్యాత్మిక ప్రముఖులంతా హాజరయ్యే అవకాశం

కదిరిలో నిర్వహించనున్న అయోధ్య సీతారాముల కల్యాణోత్సవానికి దేశంలో ఉన్న ప్రముఖ అధ్యాత్మిక ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. వివిధ రాష్ట్రాల నుంచి పండితులు వచ్చి ఈ కల్యాణోత్సవంలో పాల్గొననున్నారు. భక్తులకు కూడా కల్యాణోత్సవంలో ప్రత్యేకమైన బాధ్యతలు తీసుకునేందుకు అవకాశం కల్పించే యోచన చేస్తున్నారు. శ్రీరాముని సేవలో పాల్గొనేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపిస్తారు. అదో అదృష్టంగా భావిస్తారు. అందుకే కల్యాణోత్సవం అందరి చేతుల మీదుగా జరిగిందనిపించేలా నిర్వహించనున్నారు.

రాజకీయాలకు సంబంధం లేని కార్యక్రమం

హిందూత్వం కోసం భారతీయ జనతా పార్టీ నేతలు ఏం చేసినా.. దాన్ని రాజకీయాలకు ముడి పెట్టుకుని రచ్చ చేస్తూంటారు కొంత మంది నేతలు. కానీ అయోధ్య రాముని కల్యాణం విషయంలో మాత్రం పార్టీలకు అతీతంగా వ్యవహరాలు జరుగుతున్నాయి. అందరూ తలో చేయి వేస్తున్నాయి. కార్యక్రమాన్ని తలపెట్టి.. నిర్వహిస్తున్నది బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కావడంతో ఆయన నేతృత్వంలో జరుగుతాయి. .రాజకీయాలుక సంబంధం లేదని అధ్యాత్మిక కార్యక్రమం అని.. దీనిపై రాజకీయ ముద్ర వేయడం.. హిందూత్వంపై నిందలేయడమేనని రాముని భక్తులు అంటున్నారు.