నాన్ వెజ్ బదులు ఇవి తినండి బెటర్!

నాన్ వెజ్ ఎందుకు తింటున్నారని అడిగితే..బలం కోసం అని చాలామంది సమాధానం చెబుతారు. మరి నాన్ వెజ్ తినని, మానెయ్యాలని అనుకున్నవారి పరిస్థితేంటి అంటారా..అలాంటి వారికోసమే ఈ సహజసిద్ధ ఆహారాలు…

నీర‌సం, బ‌ల‌హీన‌త వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నవారు చాలామంది ఉన్నారు. టైమ్ టు టైమ్ ఆహారం తీసుకున్నప్పటికీ నీరసంగా అనిపిస్తుంటుంది. అలాంటప్పుడు బలమైన ఆహారం అనగానే మాంసం, గుడ్లు, చేప‌లు అని చెబుతారు. ఇవి బ‌ల‌మైన ఆహారాలే కానీ ఖర్చుతో కూడుకున్నవి కూడా. పైగా ఇవి జీర్ణమయ్యేందుకు మనలో సగం బలం అయిపోతుంది. అందుకే నిరసం తగ్గించి తక్కువ ధరకు దొరికే సహజసిద్ధమైన ఆహారాలేంటో తెలుసుకుందాం…

పల్లీలు
బలహీనంగా కనిపించేవారు, నీరసంగా ఉందనిపించేవారు గుప్పెడు పల్లీలు నానబెట్టుకుని తింటే మంచి ఫలితం పొందుతారు. వీటిని రాత్రంతా నాన‌బెట్టి తీసుకోవ‌డం వల్ల శ‌రీరానికి బ‌లం చేకూరుతుంది. పల్లీల్లో ప్రొటీన్‌లు పుష్కలంగా లభిస్తాయి. అవి ఆకలిని నియంత్రణలో ఉంచుతాయి. ప్రతిరోజూ 30 గ్రాముల పల్లీలు తీసుకున్నట్లయితే గుండె సంబంధిత వ్యాధులు రావని వైద్యులు చెబుతున్నారు.

పచ్చి కొబ్బరి
పచ్చి కొబ్బరి తరతూ ఓ ముక్క తీసుకోవడం వల్ల నీరసం తగ్గుతుంది. శరీరానికి అవసరం అయిన బలం పడుతుంది. ప‌చ్చికొబ్బ‌రిలో కొలెస్ట్రాల్ ఉండ‌దు. పచ్చికొబ్బరి చర్మసౌందర్యానికి కూడా మంచిది

పొద్దు తిరుగుడు పప్పు
పొద్దు తిరుగుడు పప్పు తరచూ తీసుకోవడం వల్ల నీరసం తగ్గుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతారు. ఇంకా ఈ గింజలు ఫ్రీ రాడికల్స్ నుంచీ కాపాడుతాయి. ధమనుల్లో కొవ్వు పేరుకోకుండా అడ్డుకునే శక్తి ఈ విత్తనాలకు ఉంది. రోజూ ఓ పావు కప్పు గింజలు తింటే మనకు కావాల్సిన విటమిన్ Eలో 90 శాతం లభించినట్లే.

గుమ్మడి గింజలు
గుమ్మడి గింజలు ఎముకలను బలంగా తయారు చేస్తాయి. మాంసం కన్నా గుమ్మడి గింజలవల్లే అధిక ప్రయోజనాలున్నాయి అంటారు ఆరోగ్య నిపుణులు. వీటిని తరచూ తినడం వల్ల బరువు తగ్గుతారు, కండరాల ఆరగ్యానికి మంచిది. షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. జుట్టు స్ట్రాంగ్ గా ఉంటుంది.

నువ్వులు
నువ్వులను మించిన బలమైన ఆహారం మరొకటి ఉండదు..వీటికి బెల్లం జోడిస్తే మరింత మంచిది. వీటిలో ఫైబర్, విటమిన్ బి ఉంటుంది.
రక్తపోటు వచ్చే అవకాశాలును తగ్గిస్తాయి, ఆరోగ్యమైన ఎముకల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. నిత్యం నీరసంతో బాధపడేవారు, జీర్ణశక్తి తక్కువగా ఉండేవారు తరచూ నువ్వులు తీసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు.

బ‌లం ప‌ట్టే టానిక్ లు, మాంసం, గుడ్ల‌ు, చేపలకు బ‌దులుగా ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల రెండు వారాల్లోనే ఆరోగ్యకరమైన ఫలితాలు చూడొచ్చు. ఈ సహజసిద్ధ ఆహారాల వల్ల నీరసం తగ్గడంతో పాటూ ఉత్సాహంగా తయారవుతారు కూడా.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.