ప్రత్యేక హోదా పేరుతో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలతో పాటు సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ జైభారత్ నేషనల్ పార్టీ పేరేతు పెట్టుకున్న సొంత దుకాణం ద్వారా రాజకీయం చేస్తున్నారు. ప్రత్యేకహోదా అనేది ముగిసిన అధ్యాయం అని వారికి తెలుసు. అయినా తప్పుడు ఆరోపణలతో రాజకీయాలు ప్రారంభించారు. ప్రజల్లో మళ్లీ భావోద్వేగాలు రెచ్చొగొట్టి.. ఒకటి రెండు శాతం ఓట్లు అయినా తెచ్చుకుందామని అనుకుంటున్నారు. ఇలాంటి రాజకీయాల వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోతుందని వారికి తెలిసినా .. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి సిద్ధమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రత్యేకహోదా పేరుతో షర్మిల హడావుడి
ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ప్రత్యేకహోదా అస్త్రంలో ప్రధానంగా ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఢిల్లీలో ధర్నాకు సన్నాహాలు చేసుకుంటున్నారు. రెండో తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్లో ప్రత్యేకహోదాపై ధర్నా చేయనున్నారు. కాంగ్రెస్ ముఖ్య నేతల్ని ఢిల్లీకి రావాలని ఆదేశించారు కొంత మంది ఏఐసీసీ నేతలు కూడా ధర్నాలో పాల్గొనే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేకహోదాను ఇస్తామని రాహుల్ గాంధీ చెబుతున్నారు. గతంలోనూ ఆదే ప్రధాన హామీగా ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీకి పెద్దగా బలం లేకపోవడంతో ఆ హామీకి విలువ లభించలేదు. కానీ ఇప్పుడు షర్మిల లాంటి నాయకత్వం రావడంతో.. హోదా అంశంపై చర్చ జరిగే అవకాశం ఉందని ఆశపడుతున్నారు.
జేడీ లక్ష్మినారాయణ తీరే వేరు !
ఇక సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ ఓ పార్టీకి తనను అధ్యక్షుడిగా ప్రకటించుకుని కొత్త దుకాణం ప్రకటించుకుని ప్రత్యేకహోదా జపం చేస్తున్నారు. ఆయన తాజాగా ట్విట్టర్లో విచిత్రమైన డిమాండ్ చేశారు. ఏమిటంటే.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను నిలిపివేయాలట. టీడీపీ, వైసీపీలను ఈ డిమాండ్ చేశారు. ఈ రెండింటితో సంబంధం లేకుండానే బీజేపీకి సంపూర్ణ మెజార్టీ ఉందనే సంగతిని జేడీ లక్ష్మినారాయణ కన్వీనియంట్ గా మర్చిపోయినట్లుగా నటిస్తున్నారు. ఏదో పెద్ద ప్రత్యేకమైన ప్లాన్ వేశానని అనుకుంటున్నారు. కానీ ఆయన తీరు చూసి అందరూ ఆశ్చర్య పోతున్నారు.
ప్యాకేజీ తీసుకున్నారుగా ఇక హోదా ఎలా ఇస్తారు ?
నిబంధనల ప్రకారం సరిహద్దు రాష్ట్రాలు ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకే ప్రత్యేకహోదా ఉంటుంది. ఏపీ వంటి రాష్ట్రాలకు ఉండదు. అందుకే హోదా పేరు లేకపోయినా ప్యాకేజీ ఇచ్చారు. భారీగా ప్రయోజనం కూడా కలిగిదింది. ఇటీవల కేంద్రం ఒకే సారి పది వేల కోట్ల రూపాయల లోటు భర్తీ కూడా చేసింది. ఇంత ప్రయోజనం పొందినా హోా పేరుతో … షర్మిల, జేడీ రాజకీయాలు చేస్తున్నారు. వారి తీరును చూసి.. జనం విస్మయానికి గురవుతున్నారు. సొంత ప్రయోజనాల కోసం ఎంపీకి ఎందుకు ఇంత నష్టం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నా వారు పట్టించుకోవడం లేదు.