ఆస్తమాతో బాధ‌పడే వారికి ఈ పండు మంచి ఔషధం!

కివి పండ్లు..అన్ని సీజన్లలో లభిస్తాయి. పుల్లపుల్లగా ఉండే రుచిగా ఉండే వీటిని సలాడ్, జ్యూసెస్ రూపంలో తీసుకుంటారు. ముఖ్యంగా డెంగ్యూ బారిన పడినప్పుడు తింటే ప్లేట్లెట్ల సంఖ్య పెరుగుతుంది అంటారు. అయితే కివి ఫ్రూట్ వల్ల ఇదొక్కటే కాదు చాలా ప్రయోజనాలున్నాయి…

రోగనిరోధక శక్తి పెరుగుతుంది
కివీ పండులో విట‌మిన్ సి, విట‌మిన్ ఎ, విట‌మిన్ కె, కెరోటినాయిడ్లు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబ‌ర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వల్ల మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే రోజూ వారి విట‌మిన్ సి ల‌భిస్తుంది. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. వాతావ‌ర‌ణ మార్పుల కార‌ణంగా వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా కాపాడుతుంది.

ఆస్తమా ఉన్నవారికి ఉపశమనం
ఆస్తమాతో బాధపడేవారు రోజుకో కివి పండును తినడం వల్ల మంచి ఫలితం ఉంటుందంటున్నారు వైద్యులు. ఈ పండ్లను రోజూ తినడం వల్ల వ్యాధి తీవ్రత తగ్గుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కంటిచూపు మెరుగుపడుతుంది. నిద్రలేమితో బాధపడేవారు రోజూ సాయంత్రం సమయంలో కివి పండు తింటే నిద్రలేమి సమస్యను అధిగమించవచ్చు.

గుండెకు ఆరోగ్యం
కివీ పండ్ల‌ను రోజూ తీసుకోవ‌డం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. గుండెకు సంబంధించిన స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి. ర‌క్త‌పోటు అదుపులో ఉంటుంది. జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డి మ‌ల‌బద్ద‌కం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

అందాన్ని పెంచే కివి
అందంగా, యవ్వనంగా కనిపించేందుకు కూడా కివి ఫ్రూట్ సహాయపడుతుంది. కివీ పండులో ఉండే విట‌మిన్ ఇ చ‌ర్మ ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. ఈ పండ్ల‌ను తీసుకోవ‌డం వల్ల చ‌ర్మంపై మ‌చ్చ‌లు, ముడ‌త‌లు తొల‌గిపోతాయి. వృద్దాప్య ఛాయ‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి. తీసుకునే ఆహారంలో ఉండే ఐర‌న్ శ‌రీరానికి చ‌క్క‌గా అందించేందుకు కివి ఉపయోగపడుతుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.