రామ మందిరం భద్రతకు ఇజ్రాయెల్ యాంటీ డ్రోన్ సిస్టమ్

అయోధ్య రామ మందిరం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రాణ ప్రతిష్ఠ సమయంలో ఏజెన్సీల నుంచి యాంటీ డ్రోన్ సిస్టమ్ ఉపయోగించారు. అయితే ఇకపై సొంతంగా యాంటీ డ్రోన్ సిస్టమ్ ఉండాలని ఉత్తర ప్రదేశ్ పోలీసులు భావించారు. ఈ మేరకు ఇజ్రాయెల్ నుంచి ఐ10 యాంటీ డ్రోన్ సిస్టమ్ కొనుగోలు చేశారు.

భద్రత మరింత కట్టుదిట్టం
ఆలయ ప్రాణప్రతిష్ఠ తర్వాత అయోధ్యకు భక్తులు క్యూ కడుతున్నారు. కేవలం ఆరు రోజుల్లోనే దాదాపు 19 లక్షల మంది దర్శనం చేసుకున్నారు. భక్తుల రద్దీ వల్ల దర్శన సమయాల్లో ఆలయ ట్రస్ట్ మార్పులు చేసింది. ఉదయం 6 గంటల నుంచే దర్శనాలకు అనుమతిస్తోంది. ఉదయం 4:30 గంటలకు శృంగార హారతి, ఉదయం 6:30 గంటలకు మంగళ ప్రార్ధన నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనానికి బారులు తీరుతున్నారు. ఆలయ ప్రాంగణంలో రద్దీ నిత్యం ఉంటోంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా రామ జన్మ భూమి ట్రస్ట్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మందిరం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రాణ ప్రతిష్ట సమయంలో సీఆర్పీఎఫ్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ , స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ దళాలు కూడా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించాయి. ఆ సమయంలో ఏజెన్సీల నుంచి యాంటీ డ్రోన్ సిస్టమ్ ఉపయోగించారు. ఇకపై ఏజెన్సీల నుంచి కాకుండా సొంతంగా యాంటీ డ్రోన్ సిస్టమ్ ఉండాలని యూపీ పోలీసులు భావించారు. ఈ మేరకు ఇజ్రాయెల్ నుంచి 10 యాంటీ డ్రోన్ సిస్టమ్ కొనుగోలు చేశారు.

త్వరోలనే యాంటీ డ్రోన్ సిస్టమ్ సేవలు
ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిన యాంటీ డ్రోన్ సిస్టమ్స్ సామర్థ్యాన్ని ఇప్పటికే ఉత్తరప్రదేశ్ పోలీసులు పరిశీలించారు. యాంటీ డ్రోన్ వ్యవస్థ 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్రోన్లను గుర్తించి నిర్వీర్యం చేస్తాయి. యాంటీ డ్రోన్ల వినయోగం ద్వారా ప్రమాదాన్ని త్వరగా గుర్తించి అంతే వేగంగా నిర్ణయం తసుకునేందుకు పోలీసులకు అవకాశం ఉంటుంది. శత్రువులకు చెందిన డ్రోన్లను హ్యాక్ చేసే వీలు కూడా ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్ వల్ల సాధ్యమవుతుంది . రాష్ట్రంలో సున్నిత ప్రాంతాలైన లక్నో, వారణాసి, మథురలో యాంటీ డ్రోన్లను ఇన్ స్టాల్ చేస్తున్నామని వివరించారు యూపీ పోలీసులు. అవసరాన్ని బట్టి మిగిలిన చోట్ల నెలకొల్పుతామన్నారు. యాంటీ డ్రోన్ సిస్టమ్స్ యూపీ పోలీసులను బలోపేతం చేయడంతో పాటూ నిఘాను మరింత కఠినతరం చేసే వీలు ఉంటుందన్నారు. అధికారులు.