చలికాలంలో అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. ఇందుకు ప్రధాన కారణం విటమిన్ డి లోపం కూడా. విటమిన్ డి లోపంతో బాధపడిన వారు ముందుగానే చెక్ చేసుకోవడం ద్వారా కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే దాన్ని అధిగమించవచ్చు. సూర్యరశ్మి మీ శరీరంపై పడేలా చూసుకోవాలి. తద్వారా మీ శరీరమే విటమిన్ డిని ఉత్పత్తి చేస్తుంది. చలికాలంలో సూర్యరశ్మికి పరిమితంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీ విటమిన్ డి స్థాయిలను పెంచడం చాలా ముఖ్యం. అందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి…
విటమిన్ డి అధికంగా ఉండే ఆహారం
హారం ద్వారా విటమిన్ డి స్థాయిలను మెరుగుపరచవచ్చు. పుట్టగొడుగులు, సాల్మన్ చేపలు, గుడ్డు పచ్చసొన, పాలు లాంటి ఆహార పదార్థాలు మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ద్వారా విటమిన్ డి లోపాన్ని అధిగమించవచ్చు
శరీరానికి సూర్యకాంతి తగలాలి
శీతాకాలంలో ఉదయం సమయంలో సూర్యరశ్మి చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి రోజుల్లో కాకుండా సూర్యరశ్మి ఉండే రోజుల్లో సూర్యరశ్మి తగిలేలా కూర్చోవడానికి ప్రయత్నించండి. ఇది మీకు విటమిన్ డిని పొందడంలో సాయపడుతుంది.
లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు :
అలసట, నొప్పులు, ఎముకలు, కండరాల నొప్పులు, బలహీనత, తరచుగా ఇన్ఫెక్షన్లు రావడం అనేది విటమిన్ డి లోపానికి కొన్ని సంకేతాలుగా చెప్పవచ్చు. మీరు ఈ లక్షణాలను ఎదుర్కొంటుంటే.. ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించవద్దు. వైద్యుని సంప్రదించి వెంటనే తగిన ట్రీట్‌మెంట్ తీసుకోండి.
సప్లిమెంట్లను తీసుకోండి
మీకు విటమిన్ డి స్థాయిలు చాలా తక్కువగా ఉంటే.. మీ ఆహారంలో విటమిన్ డి సప్లిమెంట్లను తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే, ముందుగా మీ స్థాయిలను చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. మీ ఆరోగ్య సంరక్షణ నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే సప్లిమెంట్లను తీసుకోవాలి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.