ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా క్రైస్తవ సంఘంగా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అసలు సంబంధం లేని అంశాలను ఏపీకి అన్వయించి క్రైస్తవులను రెచ్చగొట్టాడనికి కొత్త అధ్యక్షురాలు షర్మిల రెడీ అయ్యారు. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆమె ప్రసంగం తీరు చూస్తే ఎవరికైనా అదే అనుమానం కలుగుతుంది.
మణిపూర్ సమస్యను క్రిస్టియన్ల సమస్యగా మార్చే ప్లాన్ ఎవరిది ?
షర్మిల ఢిల్లీలో కాంగ్రెస్ లో చేరిన తర్వాత కూడా మణిపూర్ సమస్యను ప్రస్తావించారు. మణిపూర్ లో చర్చిలను కూలగొడుతుంటే ఏపీ రాజకీయ నేతలు మాట్లాడలేదని ఆవేశ పడ్డారు. ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా అదే్ మాట్లాడారు. మణిపూర్ లో చర్చిలు కూలగొట్టారని ఏపీ పార్టీలు మాట్లాడలేదన్నారు. నిజానికి మణిపూర్ సమస్య గురించి తెలిసిన ఎవరికైనా అది క్రిస్టియన్ల సమస్య కాదని.. చర్చిలపై దాడులు మాత్రమే సమస్య కాదని అక్కడ జాతుల మధ్య సమస్య ఉందని అందరికి తెలుసు. మరి క్రిస్టియన్ల సమస్యగా షర్మిల ఎందుకు మారుస్తున్నారు.
చర్చిల పార్టీగా కాంగ్రెస్ ను మార్చబోతున్నారా ?
షర్మిల పదే పదే క్రిస్టియన్ల ప్రస్తావన తీసుకు రావడానికి ఆ పార్టీ జాతీయ వ్యూహం ఉందని అనుమానిస్తున్నారు. హిందువులు ఎలాగూ దూరమయ్యారు. ముస్లింలు నమ్మట్లేదు. అందుకే క్రిస్టియన్లను ఓటు బ్యాంకుగా ఉంచుకుందామన్న ప్లాన్ తో ఇలాంటి వ్యూహాలు అమలు చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానికి షర్మిల పావుగా మారుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఇదే ప్రశ్నించారు. షర్మిల పాస్టర్ల సంఘానికి అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
పాస్టర్ అయిన షర్మిల భర్తే కాంగ్రెస్ లో చేరలేదు
షర్మిల భర్త మత ప్రచారకుడు . అయితే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో ఆయనకూ కాంగ్రెస్ కండువా కప్పేందుకు మల్లిఖార్జున ఖర్గే ప్రయత్నించారు. కానీ.. ఆయన మాత్రం నిరాకరించారు. తాను మత ప్రచారకుడ్నని తనకు రాజకీయాలు లేవని ఆయన చెప్పుకొచ్చారు. అంటే.. పాస్టర్లు ఎవరూ రాజకీయ ముద్ర కోరుకోరు. కానీ తన భర్తకు ఇష్టం లేని పనిని క్రైస్తవులందరికీ ఆపాదించేందుకు షర్మిల ప్రయత్నించడం వివాదాస్పదంగా మారింది.