అయోధ్యకు వెళ్లాలని ప్లానింగ్‌లో ఉన్నారా? అయితే స్పెషల్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయని తెలుసా. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఈజీగా అయోధ్యకు వెళ్లొచ్చు. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
అయోధ్యకు స్పెషల్ ట్రైన్ వివరాలివే
గుంటూరు నుంచి ఈ స్పెషల్ ట్రైన్ బయలు దేరి అయోధ్యకు వెళుతుంది. గుంటూరు – అయోధ్య ధామ్ – గుంటూరు మధ్య ఈ ట్రైన్ నడుపుతున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ఈ ట్రైన్ కేవలం రెండు రోజులు మాత్రమే ఉంటుంది. గుంటూరు నుంచి జనవరి 31న బయలు దేరుతుంది. అయోధ్య ధామ్ నుంచి మార్చి 3న గుంటూరుకు ఈ ట్రైన్ రిటర్న్ వస్తుంది. ఈ ట్రైన్ నెంబర్ 07215. కాగా గుంటూరుతో ఈ రైలు మధ్యాహ్నం 1 గంటకు బయలు దేరుతుంది. ఇక అయోధ్యలో అయితే ఈ ట్రైన్ సాయంత్రం 5.45 గంటలకు బయలు దేరుతుంది.
ఏఏ స్టేషన్ల గుండా వెళుతుంది
ఈ స్పెషల్ ట్రైన్ విజయవాడ, ఏలూరు, తాడేపల్లి గూడెం, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట, అన్నవరం, తుని, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పలాస వంటి స్టేషన్లలో ఆగుతుంది. ఈ స్పెషల్ ట్రైన్ దాదాపు 2,101 కిలోమీటర్లు ప్రయాణించనుంది. మీరు అయోధ్యక వెళ్లే ప్లానింగ్‌లో ఉంటే మాత్రం ఈ ట్రైన్‌ను ముందే బుక్ చేసుకోవచ్చు.
మొత్తం 60 ప్రత్యేక రైళ్లు – హైదరాబాద్ నుంచి 15 ట్రైన్స్
అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్య సందర్శనకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 28 వరకు మొత్తంగా 60 రైళ్లు నడుస్తామని పేర్కొన్నారు. ఈ స్పెషల్ ట్రైన్స్‌లో 15 హైదరాబాద్ నుంచే ఉంటాయని అన్నారు. అయితే విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్, తదితర ధార్మిక సంస్థల ద్వారా మాత్రమే టికెట్ బుకింగ్ సేవలు లభిస్తాయని చెప్పారు. హైదరాబాద్ నుంచి అయోధ్య ప్రయాణ ఛార్జీ (స్లీపర్) రూ. 1500 ఉంటుందని పేర్కొన్నారు.
రైలు మార్గంతో పాటూ.. మధుర, చిత్రకూట్, ఆగ్రా, ఢిల్లీ సహా ఇతర మార్గాల నుంచి సైతం బస్సులు నడవనున్నాయి. దేశంలోని వివిధ నగరాల నుంచి అయోధ్యకు విమానాలు నడుస్తున్నాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్ విమానాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ముంబయి, ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా సహా పలు నగరాల నుంచి విమానాల షెడ్యూల్ ఖరారైంది. త్వరలోనే మరికొన్ని నగరాల నుంచి విమానాలు నడువనున్నాయి.