రాముడికి ‘హనుమాన్’ విరాళం

తేజ సజ్జా హీరోగా ప్రశాంత్‌ వర్మ రూపొందించిన ఈ ‘హను-మాన్‌’ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌ అందుకుంది. ఈ మేరకు హనుమాన్ మూవీ టీమ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. అయోధ్యలోని రామ మందిరంలో రాముడి ప్రాణ ప్రతిష్టకు విరాళం ఇస్తామని హనుమాన్ మూవీ టీమ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇచ్చిన మాటకు కట్టుబడి తాజాగా అయోధ్యకు భారీ విరాళం ఇచ్చింది హనుమాన్ మూవీ టీమ్.

దాదాపు రెండున్నర కోట్లు విరాళం
అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం ‘హను-మాన్‌’ చిత్ర బృందం విరాళం ప్రకటించింది. ఈ సినిమా ప్రతి టికెట్‌పై రూ.5 చొప్పున మందిర నిర్మాణానికి ఇవ్వనున్నట్లు ఇదివరకే ప్రకటించారు. దానికి అనుగుణంగా అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట వరకూ మొత్తం 53,28,211 టికెట్లు విక్రయించగా.. వచ్చిన రూ.2,66,41,055లను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ వివరాల్ని నిర్మాత కె.నిరంజన్‌ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే హనుమాన్ ప్రీమియర్ షోల నుంచి విక్రయించిన 2,97,162 టిక్కెట్ల నుంచి రూ.14,85,810 చెక్కును అందజేశారు.

తొలి తెలుగు సూపర్ హీరో మూవీ
మరోవైపు హనుమాన్ మూవీకి గంటల్లో వేల టికెట్స్ అమ్ముడు పోతున్నట్లు సమాచారం. హనుమాన్ విడుదలై రెండో వారంలోకి ఎంటరైన ఇంకా ఫుల్ క్రేజ్‌లో టికెట్స్ అమ్ముడుపోతున్నాయని, ప్రేక్షకులు సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగు తొలి సూపర్ హీరో మూవీగా వచ్చిన హనుమాన్‌కు రెండో శనివారం రూ.14.25 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. అంటే, ఫస్ట్ శనివారంతో పోలిస్తే రెండో శనివారం కలెక్షన్స్ మెరుగ్గా ఉన్నాయి. హనుమాన్ మూవీకి రూ. 113.85 కోట్ల నెట్ కలెక్షన్స్, రూ. 177.15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అన్ని వర్గాల ప్రేక్షకులతో పాటు విమర్శలు ప్రసంశలు అందుకుంటోంది

హనుమాన్ మూవీలో తేజ సజ్జ, అమృత అయ్యర్‌తో పాటు వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్ రాయ్, దీపక్ శెట్టి, సముద్ర ఖని, వెన్నెల కిశోర్, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషించారు. వరలక్ష్మీ శరత్ కుమార్ అంజమ్మగా హనుమంతుకు అక్కగా నటిస్తే.. పవర్ ఫుల్ విలన్‌ మైఖేల్‌గా వినయ్ కుమా