రియల్‌ డెవలప్‌మెంట్ : విశాఖలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ ఉందని మీకు తెలుసా ?

విభజన చట్టంలో భాగంగా ఏపీకి కేంద్రం ఎన్ని విద్యా సంస్థలు ఇచ్చిందో.. ఎవరికీ తెలియదు. విభజన హామీలన్నింటినీ నెరవేర్చేలా వేల కోట్లు కేటాయించినా ఎవరికీ తెలియనివ్వవు ప్రాంతీయ పార్టీలు. విభజన చట్టంలో భాగంగా విశాఖలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీని ఏర్పాటు చేశారు. ప్రపంచ స్థాయిలో డిమాండ్ ఉండే కోర్సులను ఇక్కడ అందిస్తారు. కానీ ఏమీ చేయలేదని ప్రచారం చేసే క్రమమంలో దీని గురించి ఎవరూ బయటకు చెప్పడం లేదు.

విశాఖలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ ( IIPE ) అంతర్జాతీ ప్రాముఖ్యత కలిగిన ఒక సంస్థ. 2016లో విశాఖలో ప్రారంభించారు. IIT, IIMలతో సమానంగా డొమైన్ ఉన్న నిర్దిష్ట సంస్థ, పెట్రోలియం , సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వమే దీన్ని నిర్వహిస్తుంది. ఈ సంస్థను పార్లమెంట్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్‌గా ప్రకటించింది కూడా. పెట్రోలియం రంగంలో అద్భుతమైన అవకాశాలు అందిపుచ్చుకునేలా.. ఈ విద్యా సంస్థ కోర్సులను నిర్వహిస్తోంది.

వంగలి గ్రామంలో 210 ఎకరాల క్యాంపస్

విశ్వవిద్యాలయానికి విశాఖపట్నం, సబ్బవరం మండలం, వంగలి గ్రామంలో 210 ఎకరాల భూమిని కేటాయించారు . IIPE HPCL , IOCL , ONGC , GAIL , OIL , OIDB, BPCL, వాణిజ్య మంత్రిత్వ శాఖ వంటి ఆయిల్ మేజర్‌లతో కలిసి ఈ సంస్థ పని చేస్తుంది. ఈ సంస్థ ప్రస్తుతం JEE (అడ్వాన్స్‌డ్) ర్యాంకింగ్‌ల ఆధారంగా పెట్రోలియం ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ , మెకానికల్ ఇంజనీరింగ్‌లలో 4-సంవత్సరాల B.Tech కోర్సులు, అప్లైడ్ జియాలజీలో 2 సంవత్సరాల MSc ప్రోగ్రామ్, ఎనర్జీ ఇంజనీరింగ్‌లో 2 సంవత్సరాల ఎం టెక్ ప్రోగ్రామ్ మరియు Ph.D. కార్యక్రమాలు. ఇన్స్టిట్యూట్ యొక్క పాఠ్యాంశాలుఉంటాయి. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఉంటాయి. దేశంలోని ఆయా రంగాల్లోని అత్యున్నత ప్రమాణాలు ఉన్న ప్రొఫెసర్లు వచ్చి బోధిస్తారు.

అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా కేంద్రం ప్రోత్సాహం

టెక్సాస్ A & M విశ్వవిద్యాలయం , IIPE మధ్య అకడమిక్ ఒప్పందం ఉంది. ఇంకా పలు విదేశీ యూనివర్శిటీలు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ తో కలిసి పని చేస్తున్నాయి. ఈ సంస్థను అంతర్జాతీయ సంస్థగా తీర్చి దిద్దేందుకు కేంద్రం ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందిస్తోంది. దీని వల్ల విశాఖకు మరింత గుర్తింపు వస్తోంది. అయితే ఏపీలోని రాజకీయ పార్టీలు మాత్రం.. ఏమీ చేయలేదని బీజేపీపై నిందలు వేస్తూనే ఉన్నాయి.