మన లేపాక్షి గురించి మనకే పెద్దగా తెలియదు. ఇక దేశం.. ప్రపంచానికి ఎలా తెలుస్తుంది. గత ప్రభుత్వాలు మన రాష్ట్రానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చే లేపాక్షిని పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేశాయి. గుర్తింపు తీసుకు రాలేదు. అసలు తాము గుర్తించడానికే ఆసక్తి చూపించలేదు. కానీ ప్రధాని మోదీ మాత్రం ఒక్క సారి లేపాక్షికి వెళ్లి దేశం మొత్తం ఆ ఆలయానికి ప్రత్యేకంగా గుర్తింపు తీసుకు వచ్చారు.
లేపాక్షిలో మోదీ ప్రత్యేక పూజలు
ప్రధాని మోదీ లేపాక్షిలో వీరభద్రస్వామి, దుర్గా దేవిలకు ప్రధాని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం విశిష్టతను లేపాక్షి శిల్పకళా సంపదను ప్రధానికి ఆలయ అధికారులు వివరించారు. శ్రీరామ భజనతో పాటు సంగీత కచేరిని మోదీ వీక్షించారు. శిల్ప కళా సంపదను లేపాక్షి స్థల పురాణాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆలయంలో వేలాడే స్తంభాన్ని మోదీకి ఆలయ అధికారులు ప్రత్యేకంగా చూపించారు. లేపాక్షి ఆలయం ప్రాంగణం చుట్టూ శిల్పకళా సంపదను ప్రధాని వీక్షించారు. అలాగే ఆలయంలో ఏర్పాటు చేసిన తోలుబొమ్మలాటను మోదీ వీక్షించారు.
జాతీయ మీడియాలో విస్తృత ప్రచారం
లేపాక్షి లో ప్రదాని మోదీ భక్తి తన్మయత్వంతో చేసిన ప్రత్యేక పూజలు దేశవ్యాప్తంగా ప్రజల్ని ఆకట్టుకున్నాయి. లేపాక్షి ఆలయం గురించి తెలుసుకోవడానికి ఇతర రాష్ట్రాల వారు ఎక్కువ ఆసక్తి చూపించారు. పెద్ద ఎత్తున లేపాక్షి గురించి ఇంటర్నెట్ లో వెదికారు. సరైన సౌకర్యాలు కల్పిస్తే పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తారని నిపుణులు అంచనా వేస్తున్నారు. అవసరమమైన సాయం చేయడానికి కేంద్రం రెడీగా ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఈగో సమస్యలకు పోయి.. లేపాక్షిని నిర్లక్ష్యం చేస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
రామాయణంలో లేపాక్షికి ప్రత్యేక గుర్తింపు
రామాయణం ఇతిహాసంలో సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళుతున్న సందర్భంలో లేపాక్షి వద్ద జటాయువు అడ్డు తగిలి నిలువరించేందుకు ప్రయత్నించిందని చరిత్ర చెబుతోంది. దీంతో ఆగ్రహావేశాలకు గురైన రావణాసురుడు ఆ జటాయువును తన ఖడ్గంతో చీల్చడంతో ప్రాణాపాయ స్థితిలో నేలకొరిగినట్లు చరిత్ర ఉంది. తదనంతరం సీతమ్మ జాడ కోసం అటుగా వస్తున్న శ్రీరాముడు జటాయువును చూసి ఏమి జరిగిందంటూ అడగగా జరిగిన విషయాన్ని చెప్పడం… ప్రాణాపాయ స్థితిలో ఉన్న జటాయును ఉద్దేశించి లే…..పక్షి అంటూ ఆశీర్వాదం చేయడంతో మళ్లీ ఆ జటాయువు ప్రాణవాయువు పొందినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.
ఇంత చారిత్ర నేపధ్యం ఉన్న లేపాక్షికి అంతర్జాతీయ గుర్తింపుతో పర్యాటక, అధ్యాత్మిక కేంద్రంగా మార్చాలని బీజేపీ గట్టి ప్రయత్నంతో ఉంది.