ఏపీకి కేంద్రం ఏమీ చేయలేదని విమర్శిస్తూ ఉంటారు. కానీ దేశంలో అత్యధికంగా ఏపీలోనే జాతీయ రహదారులు నిర్ాణం అవుతున్నాయి. నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ ఏజెన్సీ నివేదిక ప్రకారం, ఈ డొమైన్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. కేంద్ర జాతీయ రహదారుల శాఖ అందించిన ఆర్థిక సహకారంతో రోడ్ల నిర్మాణంలో కృషి చేసినందుకు గానూ రాష్ట్రం దేశవ్యాప్తంగా రెండవ స్థానంలో నిలిచింది.
మెరిసిపోతున్న ఏపీలోని జాతీయ రహదారులు
కేంద్ర జాతీయ రహదారులు మరియు రవాణా శాఖ నిధులతో రోడ్ల నిర్మాణానికి కేంద్రం నిధులు ఇచ్చింది. జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి విశేషమైన నిధులు ప్రతీ ఏటా వస్తున్నాయి. 2022-23 వార్షిక ప్రణాళికలోనే రాష్ట్రం రూ.12,130 కోట్లను ఇచ్చింది. ప్రతి సంవత్సరం, ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో వార్షిక ప్రణాళిక కింద కేటాయించిన నిధుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన రహదారి ప్రాజెక్టుల పురోగతిని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి చెందితేనే ఆర్థిక సంవత్సరం చివరిలో నిధులు మంజూరు చేస్తారు.
రాయలసీమలో 411 కిలోమీటర్ల నిర్మాణం
తొమ్మిది జాతీయ రహదారుల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాయలసీమలో 411 కిలోమీటర్ల మేర నిర్మించనున్న హైవేలకు ఏకంగా 9,000 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు కేంద్ర రవాణా శాఖ ఆమోదముద్ర వేసింది. రాయలసీమలో పారిశ్రామికాభివృద్ధికి దోహదపడేలా కేంద్రం జాతీయ రహదారుల నిర్మాణంచేపట్టాలని నిర్ణయించింది. వాటికి ఎటువంటి అభ్యంతరాలు తెలపకుండా కేంద్రం నిధులు విడుదల చేయడమే కాకుండా.. పనులు పట్టాలెక్కించేందుకు రోజుల వ్యవధిలో భూమిపూజ కూడా చేశారు. ఏడాది కిందట విజయవాడ వేదికగా చేసుకొని రూ.15 వేల కోట్లతో నిర్మించనున్న రహదారులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి భూమిపూజ చేశారు. ఆ పనులు వేగంగా సాగుతున్నాయి.
యూపీ తర్వాత ఏపీకే ఎక్కువ నిధఉలు
ఏపీకి నాలుగేళ్లలోనే రూ.23,471.92 కోట్లను కేంద్ర ంఇచ్చింది. ఉత్తరప్రదేశ్ తర్వాత, ఆంధ్రప్రదేశ్ రెండవ అత్యధిక నిధులను అందుకుంది. జూన్ 2019 నాటికి, రాష్ట్రం 6,861.68 కి.మీ జాతీయ రహదారులను కలిగి ఉంది మరియు అప్పటి నుండి, అదనంగా 1,302.04 కి.మీ కొత్త జాతీయ రహదారులు నిర్మించబడ్డాయి. మార్చి 2023 నాటికి, రాష్ట్రం మొత్తం 8,163.72 కి.మీ జాతీయ రహదారులను కలిగి ఉంది. ప్రస్తుతం, రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక జోన్లు, తీర ప్రాంతాలు, ఆర్థిక మండలాలు మరియు పర్యాటక ప్రాంతాలను కలిపే రహదారులను అభివృద్ధి చేయడంలో గణనీయమైన పురోగతి ఉంది….
ఇంత పురోగతి కనిపిస్తున్నా కేంద్రం ఏమీ చేయలేదని.. ప్రచారం చేస్తూనే ఉంటారు. ఇది చేసే వారిని కూడా ఇబ్బంది పెట్టడమే అవుతుంది.