రాజకీయాల్లో అధికార ప్రతిపక్షాలు – జాబ్ క్యాలెండర్‌ కోసం బీజేపీ యువత ఆమరణ దీక్షలు !

ఏపీ రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయాయి. అభ్యర్థులు, రాజకీయాలు అంటూ ప్రజల గురించి మర్చిపోయారు. కానీ బీజేపీ మాత్రం ప్రజల కోసం..యువత కోసం రోడ్డెక్కి ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ప్రధాన మీడియా పట్టించుకోకపోయినా.. బీజేవైఎం నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఆమరణదీక్షలు చేశారు. జాబ్ క్యాలెండర్ ను తక్షణం రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.

జాబ్ క్యాలెండర్ పేరుతో ఏపీ ప్రభుత్వం మోసం

యువత జీవితాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెలగాటమాడుతున్నారని భారతీయ జనతా యువ మోర్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీ కృష్ణ ఉద్యమం ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వం ప్రతి ఏటా జనవరి 1న ప్రకటిస్తామని మాయ మాటలు చెప్పి ఇప్పుడు మాట తప్పిన జాబ్ క్యాలెండర్ అంశంపై భారతీయ జనతా యువ మోర్చా పోరాటం చేస్తోంది. గడిచిన ఐదేళ్లుగా నిరుద్యోగ సమస్యతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజుకు ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటున్నారని .. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా బీజేవైఎం పోరాటం చేస్తోంది.

బీజేవైఎం నేతల ఆమరణదీక్షలు

మిట్టా వంశీ కృష్ణ తో పాటు బీజేవైఎస్ నేతలు ఆమరణనిరహారదీక్ష చేశారు. రెండు రోజుల తర్వాత పోలీసులు బలవంతంగా వారిని ఆస్పత్రికి తరలించారు. గడిచిన ఐదేళ్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐదు జాబ్ క్యాలెండర్లు విడుదల చేయాల్సి ఉన్నా ఎక్కడా అది జరగలేదన్నారు.యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గడిచిన 2024 జనవరి 1 వ తేదీ ముఖ్యమంత్రిగా చివరి జనవరి 1 గా మిగలబోతుందని ఈ సందర్భంగా బీజేవైఎం నేతలు మండిపడ్డారు. ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో పాటు 2.3 లక్షల ఉద్యోగాలు తక్షణమే భర్తీ చేయకుంటే రాష్ట్రంలోని యువత రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ప్రచారం కూడా చేయనిచ్చే పరిస్థితి లేదని హెచ్చరించారు.

ప్రాంతీయ పార్టీల వల్ల యువతకు అన్యాయం

గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో, ఇప్పుడు వైసీపీ హయాంలో రాష్ట్రంలో యువతకు అన్యాయం జరుగుతూనే ఉంది.
అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఒకే ఒక్క సారి జాబ్ క్యాలెండర్ విడుదల చేసి కేవలం 10,143 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేసింది. వాటిలోన కొన్ని పూర్తిగా భర్తీ చేయలేదు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయని హడావుడిగా కేవలం 10 వేల ఉద్యోగాలకు రెండు మూడు నోటిఫికేషన్లు విడుదల చేసిన ఈ ప్రభుత్వం వాటిని కూడా ఎన్నికల కంటే ముందు పూర్తి చేసే పరిస్థితి లేదు. ఈ అంశాలపై బీజేపీ పోరాటం చేస్తుందని .. వెనక్కి తగ్గేది లేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.