ఛత్తీస్ గఢ్ సర్వీస్ కమిషన్ స్కాముపై సీబీఐ విచారణ

ఉన్నత ఉద్యోగాల నియామకంలో అవకతవకలకు సంబంధించి ఛత్తీస్ గఢ్ లో పెద్ద దుమారమే రేగుతోంది. అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. స్కాముల పుట్టగా మారిన కాంగ్రెస్ ఇప్పుడు ఎదురుదాడితో బతికిపోవాలని ప్రయత్నిస్తోంది. బీజేపీ మాత్రం నిందితులను న్యాయస్థానం ముందు నిలబెట్టి దోషులుగా తేల్చే వరకు ఊరుకునేది లేదని తేల్చేసింది.

సీబీఐ విచారణతో షాకైనా కాంగ్రెస్

ఛత్తీస్ గఢ్ స్టేట్ పబ్లిక్ సర్వీసు కమీషన్ పరీక్షల నిర్వహణ, నియామకాల్లో జరిగిన స్కాములపై సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించిన వేంటనే కాంగ్రెస్ పార్టీ తప్పించుకునే మార్గాలను వెదకడం మొదలు పెట్టింది. 2008లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే సర్వీస్ కమిషన్ అవకతవకలు జరిగాయని చెప్పేందుకు ప్రయత్నించింది. యువత జీవితాలు నిర్వీర్యం కాకముందే బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి భూపేష్ భాగెల్ సలహా ఇచ్చారు. దానితో బీజేపీకి చిర్రెత్తుకొచ్చింది. స్కాముల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదని సుశాంత్ సుక్లా, అరుణ్ సావో లాంటి నేతలు సమాధానమిచ్చారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓపీ చౌదరి.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు కూడా చేశారు.

అవినీతి చేసేందుకే కమిషన్ చైర్మన్ నియామకం

కాంగ్రెస్ హయాంలో పబ్లిక్ సర్వీస్ చైర్మన్ గా ఉన్న తమన్ సింగ్ సోన్వానీ తనకు అనుకులంగా ఉండే ఐదుగురిని సభ్యులుగా నియమించుకున్నారు. వారు సమర్పించిన జాబితాలో ఉన్న వారికే నియామకాలు ఖరారు చేశారు. డిప్యూటీ కలెక్టర్ నుంచి డీఎస్పీ వరకు అన్ని ఉద్యోగాలు సిఫార్సుల ద్వారానే జరిగాయి. సోన్వానీ కుటుంబానికి దగ్గర బంధువులు డిప్యూటీ కలెక్టర్లుగా ఉద్యోగాలు పొందారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని ఉన్నతాధికారుల కుటుంబాల పిల్లలందరికీ ఎక్సైజ్, లేబర్ శాఖల్లో పెద్ద ఉద్యోగాలు వచ్చాయి. ఈ అంశాలను ప్రస్తావిస్తుంటే కాంగ్రెస్ పార్టీకి టెన్షన్ పెరిగిపోతోంది.

జవాబు పత్రాల మూల్యాంకనలో అవకతవకలు

సర్వీస్ కమిషన్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనలో జరిగిన అవకతవకలను బీజేపీ బయట పెట్టింది. దాన్ని చూస్తే ఎవరైనా షాకుకు గురి కావాల్సిందే. 1857 సిపాయి తిరుగుబాటులో పాల్గొన్న వీర హనుమాన్ సింగ్ పై ఎనిమిది మార్కుల ప్రశ్న అడిగారు. ఓ అభ్యర్థి దానికి వీర నారాయణ సింగ్ అంటూ సమాధానం రాశారు. అయినా సరే దానికి ఐదు మార్కులు వేశారు. వీర హనుమాన్ సింగ్ అంటూ కరెక్ట్ సమాధానం రాసిన వ్యక్తికి కేవలం నాలుగు మార్కులు వేశారు. మొత్తం వ్యవహారంలోకి వెళితే 171 పోస్టులకు సంబంధించి ఛత్తీస్ గఢ్ పబ్లిక్ సర్వీస కమిషన్ 2021లో నోటిఫికేషన్ విడుదల చేసింది. 2022 ఫిబ్రవరి 13 ప్రిలిమినరీ పరీక్షలు జరిగా అందులో 2 వేల 565 మంది పాసయ్యారు. 2022 మేలో మూడు రోజుల పాటు మెయిన్స్ పరీక్షలు జరిగాయి. అందులో 509 మంది ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. ఇంటర్వ్యూ తర్వాత 171 మందిని ఎంపిక చేశారు. ఎంపికైన వారి జాబితా చూస్తే కమిషన్ చైర్మన్ బంధువులు, కాంగ్రెస్ నేతల పిల్లల పేర్లు ఎక్కువగా కనిపించాయి. ఉన్నతాధికారుల పిల్లలు సెలెక్ట్ అయ్యారు. దానితో నాన్కీ రామ్ కన్వర్ అనే బీజేపీ నాయకులు ఛత్తీస్ గఢ్ హైకోర్టులో కేసు వేశారు. దానిపై స్పందించిన ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది….