సబ్జా గింజలు కూడా ఒక రకం తులసి జాతికి చెందినవే. ఐస్ క్రీమ్స్, జ్యూస్ లలో ఎక్కువగా వినియోగిస్తున్నారు. చాలా మందికి సబ్జా అంటే వెంటనే ఫలుదా గుర్తుకు వస్తుంది. ఇవి కొందరికి తెలియనే తెలియదు. వాటి ఉపయోగాలు కూడా అవగాహన ఉండి ఉండదు. కానీ వీటిలో ఉన్న పోషకాలు తెలిస్తే అస్సలు వదిలి పెట్టరు.
సబ్జా సీడ్స్ ఇప్పటివి కావు..పురాతన కాలం నుంచి వీటి ప్రాముఖ్యత ఎక్కువే. ఈ సీడ్స్ ఎక్కువగా ఇండియా, చైనా, అమెరికా దేశాల్లో పండిస్తున్నారు. ఇది సీజనల్ గా… మార్చి నుంచి జూన్ మధ్యలో వస్తాయి. సబ్జా కూడా తులసి జాతికి చెందినది కావటం వలన సబ్జా , తులసి సీడ్స్ ఒకేలా ఉంటాయి. సబ్జా గింజల్లో ఉండే పోషకాలు డయాబెటిస్ ని అదుపులో ఉంచుతాయి, రక్తంలో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తాయి. ఇంకా చాలా ఉపయోగాలున్నాయి..
అసిడిటీకి దివ్య ఔషధం
బాడీ హీట్ ని తగ్గించి, కూల్ గా ఉంచేందుకు సబ్జా ఉపయోగపడుతుంది. అందుకనే సమ్మర్ లో బెస్ట్ పానీయం సబ్జా వాటర్ అని చెబుతారు . డైలీ పరగడుపున సబ్జా వాటర్ తాగితే శరీరంలో వేడి తగ్గుతుంది. మలబద్దకం తో బాధపడే వారికి, అసిడిటీ కి ఇది దివ్యౌషధం. వెయిట్ లాస్ కోసం కూడా సబ్జాలని వాడొచ్చు. బాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించి, బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. సబ్జా గింజలను డైలీ ఉదయం పూట తీసుకోవటం వలన హార్ట్ డిసీజ్ లను అరికడుతుంది. బాడీకి కావాల్సిన మినరల్స్ ని అందిస్తుంది. నీటిలో కలిపి తింటే తలనొప్పి, మైగ్రేన్ సమస్యలు నయమవుతాయి.
ఎలా తీసుకోవాలి
సబ్జాలుని నీటిలో వేసి కాసేపు నాననివ్వాలి. అవి జెల్ లా మారగానే వాటర్లో మిక్స్ చేసుకుని తాగొచ్చు. కొందరు పంచదార వేసుకుంటారు. ఇంకొందరు వాటర్ లా తాగుతారు. లేదంటే ఫ్రూట్ సలాడ్స్, ఫ్రూట్ జ్యుస్ లలో , మజ్జిగ లాంటి వాటితో కలిపి తీసుకోవచ్చు. వీటిని నీటిలో వేసుకుని తింటే జీర్ణ సంబంధ సమస్యలు పోతాయి. ఫుడ్ బాగా డైజెస్ట్ అవుతుంది. సబ్జా గింజలను పొడి చేసి గాయాలపై వేసి కట్టు కడితే అవి త్వరగా మానుతాయి. ఇన్‌ఫెక్షన్లు రావు. గోరు వెచ్చని నీటిలో తేనె, అల్లం రసం కలిపి, దాంతోపాటు కొన్ని సబ్జాగింజలను కూడా వేసి తాగితే దగ్గు, జలుబు లాంటి శ్వాసకోశ సమస్యలు నయమవుతాయి.
అతి వద్దు
ఇన్ని ఉపయోగాలున్నాయని అతిగా తీసుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవు. సబ్జా మోతాదుకి మించి తీసుకుంటే డయేరియా వచ్చే అవకాశం ఉంటుంది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.