ఉత్తరాదిని కాంగ్రెస్ పార్టీ దివాలా తీసినట్లుగా కనిపిస్తోంది. ఆ పార్టీ అగ్రనేతలంతా దక్షిణాదిలో పోటీ చేయడానికి పరుగెత్తికొస్తున్నారు. ఉత్తరాదిలో ఒక్క చోట కూడా గెలిచే అవకాశం లేకపోవడంతో.. దక్షిణాదిలో తమ అదృష్టం పరీక్షించుకునేందుకు పరుగులు పెడుతున్నారు. రాహుల్ గాంధీ కేరళలో ముస్లింలు మెజార్టీగా ఉన్న వయనాడ్ నుంచి పోటీ చేస్తూంటే.. తెలంగాణలోని ఖమ్మం నుంచి పోటీకి సోనియా రెడీ అయ్యారు.
ఖమ్మం నుంచి పోటీకి సోనియా రెడీ
ఈ సారి సోనియా దక్షిణాది నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. యూపీలోని రాయ్ బరేలీలో ఈ సారి గెలిచే అవకాశం లేదని తేలడంతో పాటు ఆరోగ్య కారణాల రీత్యా ఆమె ఎక్కువగా పర్యటించలేరు. అందుకే సులువుగా ఉన్న లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు . పార్టీ హైకమాండ్ నుంచి సూచనలు రాగానే వెంటనే… తెలంగాణ కాంగ్రెస్ తీర్మానం చేసింది. ఎక్కడ పోటీ చేస్తే మంచి మెజార్టీ వస్తుందో లెక్కలేసి.. నివేదిక కూడా సమర్పించారు. హైకమాండ్ వద్ద పలుకుబడి కోసం ఏం చేయడానికైనా రెడీగా ఉన్న రేవంత్ రెడ్డి… వెంటనే తీర్మానం చేసి… మెదక్, మల్కాజిగిరి, ఖమ్మం సీట్లలో పోటీ చేయాలని ప్రతిపాదించారు.
ఖమ్మంలో పోటీకి సిద్ధమైన సోనియా
కాంగ్రెస్ హైకమాండ్ ఖమ్మం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. మెదక్, మల్కాజిగిరి స్థానాలపై పరిశీలన జరిపినా… మరీ అంత ఏకపక్షంగా ఉండే అవకాశం లేదని.. కానీ ఖమ్మం మాత్రం ఏకపక్షంగా ఉంటుందన్న నిర్ణయానికి వచ్చారు. ఇటీవలి ఎన్నికల్లో ఖమ్మంలో బీఆర్ఎస్ తుడిచి పెట్టుకుపోయింది. పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరవుపార్టీని వీడటంతో క్యాడర్ అంతా వారితో వెళ్లిపోయింది. సిట్టింగ్ ఎంపీ నామా ఉన్నా ఆయన తో పెద్దగా క్యాడర్ లేదు. మంత్రిగా చేసిన పువ్వడ అజయ్ ప్లస్ కన్నా మైనస్ ఎక్కువ అయ్యారు. బీజేపీతో ముఖాముఖి పోరు ఉండే అవకాశం లేకపోవడంతో… సోనియా పోటీకి రెడీ అయ్యారు.
అందరూ సౌత్ నుంచి పోటీ చేస్తే ఉత్తరాదిన కాంగ్రెస్ కు విలువేంటి ?
యూపీలో గాంధీ కుటుంబానికి కొన్ని సీట్లు కంచుకోటలుగా ఉన్నాయి. అమేధీ, రాయ్ బరేలి రెండు చోట్ల… తప్ప మిగతా అన్ని చోట్లా కాంగ్రెస్ ఓడిపోతూ ఉంటుంది. గత ఎన్నికల్లో రాహుల్ అమేధీలో స్మృతి ఇరానీ చేతిలో ఓటమి పాలయ్యారు. ఇది తెలిసే ఆయన వయనాడ్ నుంచి పోటీ చేశారు. ఈ సారి రాయ్ బరేలిలో సోనియా కూడా ఓడిపోతుంది. అందుకే ఖమ్మంకు వస్తుంది. ఎలా చూసినా… కాంగ్రెస్ ఉత్తరాదిన దివాలా తీసినట్లే అనుకోవచ్చు.