ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా 5 గోపురాలతో, 69 ఎకరాల్లో 3 అంతస్థుల్లో 161 అడుగుల ఎత్తులో అయోధ్య రామమందిరం నిర్మితమవుతోంది. ఇది ప్రపంచంలోనే టాప్ 5 ఆలయాల్లో చోటు దక్కించుతుంది. వాస్తవానికి అయోధ్య రామమందిరం మ్యాప్ మూడు దశాబ్ధాల క్రితమే తయారు చేసినా ప్రస్తుతం ప్రణాళికల్లో మార్పులు చేయడం ద్వారా నిర్మాణంలో ఉన్న ఆలయం మరింత పెద్దదిగా, అందంగా నిర్మితమవుతోంది.
అక్షర ధామ్ ఆలయం
అక్షరధామ్ అంటే భగవంతుని దివ్య నివాసం అని అర్థం. ఢిల్లీలో ఉన్న ఈ ఆలయ విస్తీర్ణం 59.3 ఎకరాలు. ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయ సముదాయంగా అక్షరధామ్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది.
శ్రీరంగనాథస్వామి ఆలయం
తమిళనాడులోని తిరుచ్చిలో ఉన్న శ్రీరంగనాథ దేవాలయం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద దేవాలయం గా పేరుగాంచింది. ఇది దక్షిణ భారత దేశంలోనే అతి పురాతన వైష్ణవ దేవాలయాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. విష్ణువు కి ఎంతో ప్రీతికరమైన 108 దేవాలయాల్లో ఇదొకటి. తమిళనాడు లో ఉన్న ఈ దేవాలయం టాప్ 5 ఆలయాల్లో రెంజో స్థానంలో ఉంది
అయోధ్య రామ మందిరం
అయోధ్యలో నిర్మితమవుతోన్న రామమందిరం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆలయం అవుతుంది. 237 అడుగుల ఎత్తైన ఈ ఆలయాన్ని 71 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా 5 గోపురాలతో, 69 ఎకరాల్లో 3 అంతస్థుల్లో 161 అడుగుల ఎత్తులో ఆలయం నిర్మితమవుతోంది.
చిదంబరం
చిత్ అంటే జ్ఞానం, అంబరం అంటే ఆకాశం. భగవంతుడికి రూపం లేదు అనంతమైన ఆయన తత్వానికి పరిమితులుండవు అని సూచిస్తూ….మూలవిరాట్ ఉండాల్సిన చోట కేవలం ఖాళీస్థలం మాత్రమే ఉంటుంది. నిరాకారుడుగా ఉన్న స్వామికి ఇక్కడ పూజలు జరుపుతారు. పరమ శివుడు ఆనందతాండవం చేసిన ప్రాంతంగా ప్రసిద్ధి. అందుకే శివుడు నటరాజస్వామి రూపంలో ఇక్కడ కొలువై ఉంటాడు.
చెన్నకేశవ ఆలయం
బేలూరులోని చెన్నకేశవ దేవాలయం ప్రపంచంలో టాప్ 5 దేవాలయాల్లో ఐదో స్థానంలో ఉంది. చరిత్రలో నిలిచిపోయే ఆలయాల్లో చెన్నకేశవ ఆలయం ఒకటి. ఇది కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఉంది. ఈ ఆలయ ప్రాంతాన్ని దక్షిణ కాశి అని అంటారు. ఈ ఆలయ గాలిగోపురం ఎత్తు ఎంతో ప్రసిద్ధి. ఈ ఆలయంలోని రక రకాల శిల్పాలు సజీవంగానే ఉన్నాయా అని అనిపిస్తుంది . ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు అవతారమైన చెన్నకేశవ స్వామిని పూజిస్తారు.