యూపీలో బలవంతపు మతమార్పిడి… ?

ఇస్లామిక్ ఛాందసవాదం చాపకింద నీరులా విస్తరిస్తోంది. బలవంతపు మత మార్పిడులు నిత్యకృత్యమయ్యాయి. ప్రేమ పేరుతో అమ్మాయిల మతం మార్చే లవ్ జిహాద్ కేసులు రోజుకొకటి నమోదవుతున్నాయి. జరిగిన తప్పు తెలుసుకునే లోపే వెనక్కి రాలేని పరిస్థితి ఎదురవుతోంది. ప్రభుత్వాలు అక్కడక్కడ స్పందిస్తున్నా వెలుగు చూడని కేసులే ఎక్కువగా ఉన్నాయనిపిస్తోంది.

మసీదుకు వచ్చిన కొత్త వ్యక్తి…

ఉత్తర ప్రదేశ్లో మౌదాహా పట్టణంలో ఉండే ఫేమస్ కచారియా బాబా మసీదుకు రోజు కొత్త వ్యక్తి వచ్చి నమాజ్ చేయడం మొదలు పెట్టాడు.ఎవరితో మాట్లాడకుండా నమాజ్ చేసుకుని వెళ్లిపోతున్న అతడ్ని మునుపెన్నడూ చూడకపోవడం, ఎవరినీ పలుకరించకుండా తన పని తాను చేసుకుపోవడంతో రోజువారి వచ్చే జనానికి అనుమానం వచ్చింది. ఎవరు నువ్వని ప్రశ్నించగా తన పేరు మహ్మద్ యూసుఫ్ అని, తాను కాన్పూరు నుంచి వచ్చానని చెప్పుకున్నాడు.

పోలీసులకు ఫిర్యాదు చేసిన మసీదు పెద్ద..

మహ్మద్ యూసుఫ్ తీరుపై మసీదు మతపెద్దకు అనుమానం వచ్చింది. అతను ఉగ్రవాది అయి ఉంటే తర్వాతి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అనుమానించారు. తమ మసీదుకు కూడా చెడ్డపేరు వస్తుందని భయపడ్డారు. దానితో ఆయన నేరుగా పోలీసులను సంప్రదించి.. రోజు వచ్చి వెళ్తున్న కొత్త వ్యక్తి గురించి ఫిర్యాదు చేశారు. అతనోవరో తెలుసుకోవాలని కోరారు. పోలీసుల విచారణలో అసలు సంగతి బయటపడింది. మహ్మద్ యూసుఫ్ కాన్పూరు వాడు కాదని ఆ ఊరివాడేనని తెలిసింది. అతని అసలు పేరు అశీష్ గుప్తా అని తహసీల్దారు ఉద్యోగం చేస్తాడని పోలీసు విచారణలో వెల్లడించాడు.

భార్య ఎంట్రీతో పెద్ద ట్వీస్ట్..

పోలీసు విచారణ విషయం బయటకు పొక్కడం అశీష్ గుప్తా భార్య ఎంట్రీ ఇచ్చింది. ఆమె పేరు ఆర్తీ యాగ్యాసైని. తన భర్త ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుని కనిపించకుండా పోయాడని ఇప్పుడు మసీదులో కనిపిస్తున్నాడని లబోదిబోమంది. అతడ్ని బలవంతంగా మతం మార్చారని ఆరోపించింది. పోలీసులు సేకరించిన వివరాలు ప్రకారం వివాహితుడైన అశీష్ గుప్తా.. ఒక ముస్లిం అమ్మాయి ప్రేమలో పడ్డాడు. ఆమె పేరు రుక్సానా. తన కుమార్తెను ఇవ్వాలంటే మతం మార్చుకోవాలని రుక్సానా తండ్రి మున్నా షరతు పెట్టారు. డిసెంబరు 24న ఒక మసీదులో పెళ్లి చేసుకున్న గుప్తా.. తన పేరును మహ్మద్ యూసుఫ్ గా మార్చుకున్నాడు. పెళ్లిపేరుతో జరిగిన బలవంత మతమార్పిడి అయినప్పటికీ దాన్ని నిర్ధారించేందుకు యూపీ పోలీసులు కొంత సమయం కోరుతున్నారు. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఎలా స్పందిస్తారో చూడాలి..