అల్లం వాటర్ తో కరోనాకి చెక్ పెట్టండి!

మళ్లీ కరోనా వచ్చేసింది. ఎక్కడ చూసినా వరుస కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి టైమ్ లో గత అనుభవాలతో కొన్ని కొన్ని జాగ్గత్తలు తీసుకోవడం మంచింది. కరోనా రాకతో నీట్ నెస్ బాగా పెరిగింది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునేలా చేసింది. హోమ్ రెమిడీస్ పై దృష్టి సారించారు. మళ్ళీ కరోనా విజృభిస్తోన్న ఈ టైమ్ లో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెంచుకోవాల‌ని వైద్యుల సూచిస్తున్నారు. ఇమ్యూనిటీ పెంచే వంటింటి సరకుల్లో అల్లం పవర్ ఫుల్ మెడిసిన్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు…

అల్లం వాటర్ తో ఉపయోగాలు

అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఇమ్యూనిటీ పెంచ‌డంతో పాటు మరెన్నో ప్రయోజనాలను అందిస్తాయి. అల్లం వాటర్ లో విటమిన్ సి, మెగ్నిషియం, మినరల్స్ ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేస్తాయి. చాలామంది కీళ్ల నొప్పులు, ఇతర నొప్పులతో బాధపడుతుంటారు.ఇలాంటి నొప్పులను తగ్గించటంలో అల్లం మహత్తరంగా పని చేస్తుంది. డైలీ అల్లం నీరు తాగితే నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం పొందొచ్చు. షుగర్ లెవ‌ల్స్ కంట్రోల్‌లో ఉంటాయి.అజీర్తితో బాధపడుతున్న వారు ఈ రసాన్ని తాగితే ఉపశమనం కలుగుతుంది. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు దగ్గు, జలుబు, గొంతు నొప్పి నుంచి త్వరగా కోలుకునేలా చేస్తాయి.

అల్లం ఎలా వాడాలి

అల్లం మంచిదే అని ఎలా పడితే ఆలా వాడకూడదు. అల్లంపై ఉన్న పొట్టును కంపల్సరీ తీయాలి. తీసిన తరవాత వినియోగిస్తే ఏ సమస్యలు రావు. పీల్ చేయకుండా ఉపయోగిస్తే మాత్రం సమస్యలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు. చాలా మంది అల్లాన్ని వేడినీటిలో క‌లిపి తాగేట‌ప్పుడు తొక్క తీయ‌కుండా యూజ్ చేస్తారు. వాస్త‌వానికి అల్లం పై తొక్కలో విష పదార్థాలు ఉంటాయని, ఇవి ఆరోగ్యానికి హాని చేస్తాయని అంటున్నారు. ఉదయాన్ని టీలో అల్లం కలుపుకుని తాగితే అనారోగ్యం దరిచేరదు. అల్లాన్ని పచ్చిగా నమిలినా, లేదా తేనెతో కలిపి తిన్నా, జ్యూస్‌లా చేసుకుని తాగినా మంచిదే. అన్నిటికన్నా వేడి నీటిలో అల్లం తురుము వేసి మరిగించి వడకట్టి, తేనే కలుపుకుని తాగితే ఇంకా మంచిది.

అల్లం ఆకలిని తగ్గిస్తుంది. జీర్ణక్రియ సమయంలో మీరు బర్న్ చేసే కేలరీల సంఖ్యను మెరుగుపరచడానికి ఇది సహాయపడుతుంది. అల్లం వలన ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా అని అదే పనిగా తీసుకోకండి. ‘అతి సర్వత్రా వర్జ్యయేత్’ అని గుర్తు పెట్టుకోండి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.