‘గబ్బర్ సింగ్’ to ‘సలార్’..శ్రుతి సెంటిమెంట్ వర్కౌటౌ అయిందిగా!

శ్రుతి హాసన్..ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఐరెన్ లెగ్ అన్నారు. లుక్ బాలేదన్నారు. నటన అస్సలే రాదన్నారు. కానీ గబ్బర్ సింగ్ నుంచి రీసెంట్ రిలీజ్ సలార్ వరకూ వరుసగా ఫ్లాపుల్లో ఉన్న హీరోలకు ఆమె సెంటిమెంట్ గా మారింది. సాహో, రాథే శ్యామ్, ఆదిపురుష్ వరుస ఫ్లాపుల తర్వాత ప్రభాస్ కి హిట్టిచ్చిన సినిమా సలార్. ఈ మూవీ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చింది. స్క్రీన్ పై ప్రభాస్ కటౌట్ చూసి ప్రేక్షకులు వహ్వా అనకుండా ఉండలేకపోయారు. ఈ మూవీకి బావుందనే టాక్ రావడంతో శ్రుతి హాసన్ సెంటిమెంట్ పై మరోసారి డిస్కషన్ జరుగుతోంది.

శృతిహాసన్ సెంటిమెంట్
శృతిహాసన్.. కమల్ హాసన్ డాటర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది కానీ తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బ్యాస్ ఏర్పరుచుకునేందుకు టైమ్ పట్టింది. మొదట్లో ఆమె నటించిన మూవీస్ అన్నీ డిజాస్టర్స్ కావడంతో ఐరెన్ లెగ్ అనే ముద్ర పడింది. ఆమె ఉంటే సినిమా ఫ్లాప్ అన్నారు. కట్ చేస్తే ఇప్పుడు ఫ్లాప్ హీరోలకు ఆమె సక్సెస్ మంత్రం అయింది. రవితేజ, పవన్ కళ్యాణ్, పవన్ కల్యాణ్, చిరంజీవి, అల్లు అర్జున్, మహేష్ బాబు, నాగచైతన్య నుంచి ప్రభాస్ వరకు అందరికీ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చింది.

అందరకీ బ్లాక్ బస్టర్స్ ఇచ్చింది
‘ఖుషి’ నుంచి వరుస ఫ్లాపుల్లో ఉన్న పవన్ కళ్యాణ్ కెరీర్ కి ఊపిరిపోసిన మూవీ గబ్బర్ సింగ్. అప్పటి వరకూ ఐరెన్ లెగ్ గా ఉన్న శ్రుతిహాసన్ ఈ మూవీతో గోల్డెన్ లెగ్ గా మారింది. బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లతో సతమతమవుతున్న రవితేజ.. క్రాక్ తో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. లాంగ్ గ్యాప్ తర్వాత రవితేజకు సూపర్ క్రేజ్ ఇచ్చిన మూవీ ఇది. ఇద్దరమ్మాయిలతో మూవీతో ఫ్లాప్ అందుకున్న అల్లు అర్జున్ కి రేసుగుర్రం సినిమా అదిరిపోయే హిట్టిచ్చింది. ఎవడుతో రామ్ చరణ్ కి కూడా హిట్టు పడింది. ‘1 నేనొక్కడినే’, ‘ఆగడు’ లాంటి ఫ్లాప్స్ తర్వాత మహేష్ కి శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ అయింది. ఇక నాగచైతన్య వరుస ఫ్లాప్స్ సినిమాల తర్వాత శృతిహాసన్ తో కలిసి ప్రేమమ్ చేయగా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ‘ఆచార్య’, ‘గాడ్ ఫాదర్’ వంటి బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్ తర్వాత.. శృతి హీరోయిన్ గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ రూపంలో హిట్ అందుకున్నాడు చిరంజీవి. ఇలా ప్లాప్స్ లో ఉన్న హీరో సరసన శృతి హాసన్ నటిస్తే సినిమా హిట్ అవుతుందనే సెంటిమెంట్ బలపడింది.