సత్యసాయి జిల్లాలో అన్ని పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయాయి. అయితే ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజల్ని ఆకట్టుకుని వారి సమస్య కోసం పోరాటం చేసి వారి మెప్పును పొందాలనుకుంటోంది మాత్రం ఒక్క బీజేపీనే. ప్రజల్ని పట్టి పీడిస్తున్న సమస్యలపై ఇతర పార్టీలేవీ ఆందోళనలు చేయడం లేదు.ఒక్క బీజేపీ మినహా., గత వారం పది రోజులుగా ప్రతి రోజూ.. బీజేపీ నేతలు రోడ్డెక్కుతున్నారు., ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
పది రోజులుగా సత్యసాయి జిల్లాలో బీజేపీ వరుస ధర్నాలు
పది రోజులుగా సత్యసాయి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా బీజేపీ నేతలు ఆందోళనలు చేస్తూనే కనిపిస్తున్నారు. ప్రతి రోజూ ఓ ప్రజాసమస్యపై ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఇళ్లు ఇవ్వలేకపోవడం, నిరుద్యోగ సమస్య, విద్యుత్ చార్జీల పెంపు వంటి అంశాలపై వీరు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకూ విపక్ష నేతలెవరూ ఈ అంశాలపై పోరు సాగించకపోవడంతో.. బీజేపీ నేతలకు ప్రజల మద్దతు లభిస్తోంది.
మొత్తం బీజేపీని యాక్టివేట్ చేసిన విష్ణువర్ధ్ రెడ్డి
రాష్ట్ర పార్టీ తరపున ఎక్కువగా వాయిస్ వినిపిస్తూ.. బిజీగా ఉండే ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పుడు ఫోకస్ అంతా పూర్తిగా సత్యసాయి జిల్లాపై పెట్టారు. పార్టీని.. పార్టీ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో యాక్టివేట్ చేస్తున్నారు. అందర్నీ ఉత్సాహంగా రోడ్లపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం బయటకు కనిపిస్తున్న సరైన సమయంలో.. విష్ణువర్ధన్ రెడ్డి ఉద్యమం ప్రారంభించడంతో.. బీజేపీకి ఊపు వస్తోంది. పెద్ద ఎత్తున వీరికి ఎక్కడిక్కకడ స్థానిక ప్రజలు మద్దతు తెలుపుతున్నారు.
హిందూపురం పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో దూకుడు
హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో విద్యుత్ చార్జీల పెంపు, మున్సిపాలిటిల్లో పేదలపై పన్నుల పెంపు, నిరుద్యోగుల ఉద్యోగుల కల్పనలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా తీవ్ర ఉద్యమం ప్రారంభించారు. విష్ణువర్ధన్ రెడ్డి వ్యూహాత్మకంగా ఉద్యమం చేస్తున్నారు. ఇతర పార్టీల నేతలు టిక్కెట్ల హడావుడిలో ఉన్నారు. కానీ బీజేపీ లో ఎవర్ని నిలబెట్టినా అందరూ కలిసి పని చేస్తారు. అందుకే విష్ణువర్ధన్ రెడ్డి … పార్లమెంట్ నియోజకవర్గం మొత్తంలో బీజేపీని బలోపేతం చేయడానికి రంగంలోకి దిగారు. ప్రజల్ని మొబిలైజ్ చేయడంలో మంచి ఫలితాలు సాధిస్తున్నారు.