ఇవన్నీ రక్తాన్ని శుద్ధిచేస్తాయి

మనిషి శరీరంలో సుమారు 5 లీటర్లకు పైగా రక్తం ఉంటుంది. శరీరంలో రక్తం కలుషితమైనా, రక్తం తక్కువగా ఉన్నా ఎన్నో వ్యాధులు సంభవిస్తాయి. కలుషితమైన ఆహారం, నీరు, వాతావరణ కాలుష్యం, చెడు అలవాట్ల కారణంగా రక్తం కలుషితమవుతుంది. దీనివల్ల పోషకాహార లోపం ఏర్పడుతుంది. రోగాల బారిన పడుతుంటారు. ఈ పరిస్థితినుంచి యటపడాలంటే శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసుకోవాలి. ఆహారంలో చిన్న చిన్న మార్పలు చేసుకోవడం ద్వారా రక్తాన్ని శుద్ధి చేసుకోవచ్చు..

తులసి ఆకులు
తులసిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. పరగడపునే తులసి ఆకులు తింటే రక్తం శుద్ది అవుతుంది

వేపను మించినది ఏదీ లేదు
వేపలో రోగనిరోధక శక్తి ఎక్కువ. వేపఆకులను నమిలి తిని నీటిని తాగవచ్చు. వేప ఆకులను గ్రైండ్ చేసి జ్యూస్ లా తాగొచ్చు. వేప ఆకులను నూరి చిన్న గోళీలు చేసి ఎండబెట్టి ఆ తరువాత పరగడపునే తీసుకోవచ్చు. వేపలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ లక్షణాలు రక్తంలో పేరుకుపోయిన టాక్సిన్‌లను తొలగిస్తాయి.

బీట్ రూట్ వాటర్
బీట్‌రూట్‌లో బీటాసైనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. బీట్రూట్ ముక్కలను నీట్లో వేసి ఉడికింది ఆ నీటిలో జీలకర్ర పొడి చేర్చి ఫిల్టర్ చేసి తాగాలి. రెండు మూడు వారాల పాటూ తాగితే రక్తం పూర్తిగా శుద్ధి అవుతుంది. హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి.

అల్లం-నిమ్మకాయ
అల్లాన్ని పేస్ట్ చేసి అందులో నిమ్మరసం, ఉప్పు, నల్లమిరియాల పొడి వేసి బాగా కలపాలి. దీన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే రక్తం శుద్ది అవుతుంది. ప్రతిరోజూ ఉదయాన్నేనిమ్మకాయ రసాన్ని వేడినీటిలో కలిపి ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల రక్తం శుద్దిఅవుతుంది.

వెల్లుల్లి
వెల్లుల్లిని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల రక్తం శుద్ది అవుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

ఉసిరికాయ
విటమిన్-సి పుష్కలంగా ఉన్న ఉసిరికాయలు కానీ, పౌడర్ కానీ, జ్యూస్ కానీ రోజూ తీసుకుంటే రక్తం శుద్ది అవుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది

నిత్య వ్యాయామంతో శరీరంలో రక్త సరఫరా మెరుగుపడుతుంది. రక్త శుద్ధి జరుగుతుంది. శరీరం పోషకాలను బాగా శోషణ చేసుకుంటుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.