టాలీవుడ్ – బాలీవుడ్ ను ఉపేస్తున్న ఆ డైరెక్టర్ ఇప్పుడు మెగా అభిమానుల కోసం ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చాడు. అభిమానులు కోరుకోవడం.. తానే స్వయంగా అభిమాని కావడంతో ఆ కాంబోని సెట్ చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అప్పుడే మూవీ బ్యాక్ డ్రాప్ ఏంటో కూడా చెప్పేశాడు
బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తున్న మూవీ యానిమల్. సందీప్ వంగా డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ గురించే ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటోంది. అంతకు ముందు చేసినవి రెండే సినిమాలు అయినప్పటికీ..యానిమల్ తో మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే వరుస సక్సెస్ లు అందుకున్న సందీప్…ప్రభాస్ తో స్పిరిట్ మూవీ తెరకెక్కిచేపనిలో ఉన్నాడు. అయితే ఈ మూవీ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో ప్రాజెక్ట్ చేస్తాడనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. సందీప్ వంగా మెగాస్టార్ చిరంజీవికి పెద్ద అభిమాని. ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పుకున్నాడు. అయితే వీరి కాంబోలో ఓ సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు అనుకుంటున్నారు. కోలీవుడ్ లో రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి వారు తమ యంగ్ ఫ్యాన్ దర్శకులకి ఛాన్స్ ఇస్తే ఒక గుర్తుండిపోయే సినిమాలు చేస్తున్నారు. అలా చిరంజీవి ఒక సినిమా సందీప్ తో సినిమాచేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అదే విషయంపై స్పందించిన సందీప్..తాను చిరంజీవి గారితో సినిమా చేస్తే ఒక ఏక్షన్ డ్రామా చేస్తానని చెప్పుకొచ్చాడు. ఈ ఒక్క స్టేట్ మెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక్కసారి ఈ కాంబినేషన్ సెట్ అయితే లెక్కలు మారిపోవడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్…
ఇక యంగ్ హీరోల కన్నా జోరుగా దూసుకుపోతున్నాడు మెగాస్టార్. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను అనౌన్స్ చేయడంతో పాటు అంతే స్పీడ్ గా ఫినీస్ చేస్తున్నాడు. ఇప్పటికే వశిష్ణతో మూవీ చేస్తున్న చిరు… ఆ తర్వాత మరో ముగ్గురు డైరెక్టర్లు లైన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. విశ్వంభర తర్వాత చిరు వంగాతో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. సందీప్ వంగా చేయాలనుకున్న హీరోలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ సలార్, రాజా డీలక్స్, కల్కి చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అంటే స్పిరిట్ సెట్స్ పైకి వెళ్లేందుకు ఏడాది సమయం పట్టనుంది. అల్లు అర్జున్ పుష్ప తర్వాత త్రివిక్రమ్ తో బిజీ కానున్నాడు. దీంతో ఈ లోగా చిరంజీవితో సందీప్ రెడ్డి వంగా మూవీ ఉంటుందేమో అంటున్నారు.
సందీప్ తీసుకునే కథలు, రాసుకునే పాత్రలు అన్నీ కూడా వైల్డ్ గా ఉంటాయి. అలాంటి పాత్ర, కథలో చిరంజీవిని చూపించాలని సందీప్ అనుకుంటున్నాడట. చిరంజీవి మాస్‌గా కనిపించేలా డిజైన్ చేస్తున్నట్లు ఓ టాక్ నడుస్తోంది. మరి ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే రికార్డ్స్ బ్రేక్ అవ్వడం ఖాయం. ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తే కానీ క్లారిటీ ఉండదు.