రాబోయే ఎన్నికలకు సంబంధించి వైసీపీ పోటీచేసే కొన్ని నియోజకవర్గాల్లో జంబ్లింగ పద్దతి పాటిస్తోంది. జంబ్లింగ్ అంటే ఏమీలేదు అటు ఇటు వైసీపీమార్చటమే. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు రెండు ఒకేసారి వస్తున్నాయి కదా. దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు. అనుకున్నదే ఆలస్యం కొందరు సిట్టింగ్ ఎంపీలను రాబోయే ఎన్నికల్లో ఎంఎల్ఏలుగా పోటీచేయించాలని అనుకుంటున్నారట. అలాగే మరికొందరు ఎంఎల్ఏలను ఎంపీలుగా పోటీచేయించే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
ఎమ్మెల్యేలుగా ఎంపీలు పోటీ
15 మంది ఎంపీలు రాబోయే ఎన్నికల్లో ఎంఎల్ఏలుగా పోటీచేయబోతున్నారట. ఇలాంటి వారిలో వంగా గీత, మార్గాని భరత్, ఎంవీవీ సత్యనారాయణ, ఆదాల ప్రభాకరరెడ్డి, చింతా అనూరాధ, వల్లభనేని బాలశౌరి పేర్లు బాగా వినబడుతున్నాయి. ఇదే సమయంలో సుమారు 20 మంది ఎంఎల్ఏలను జగన్ ఎంపీలుగా పోటీ చేయించబోతున్నారట. మాజీమంత్రి కన్నబాబు, బొత్సా సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, కొలుసు పార్ధసారధి లాంటి వాళ్ళ పేర్లు వినబడుతున్నాయి.
ఎమ్మెల్యేలకు స్థానచలనం
30 నియోజకవర్గాల్లో అబ్యర్థులను అటూ ఇటూ మార్చనున్నారు. అధికారపార్టీలో విప్లవాత్మకమైన మార్పులుంటాయని మాత్రం అర్ధమైపోతోంది. మామూలుగా అయితే ఏ పార్టీ అధినేత కూడా ఇంత బారీ ఎత్తున మార్పులు చేయటానికి సాహసం చేయరు. కానీ ఇక్కడున్నది జగన్ కదా. అందుకనే మార్పులకు ఏమాత్రం వెనకాడటంలేదు. ఇంచార్జులుగా ప్రకటించిన వారిలో కూడా అందరికీ టికెట్లిస్తారని గ్యారెంటీలేదు. కొత్తవారికి టికెట్లివ్వటంలో భాగంగానే ముందుజాగ్రత్తగా మార్పులు చేసుండచ్చనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. జగన్ చేసిన, తొందరలో మార్పులు చేయబోతున్నారని జరుగుతున్న ప్రచారం సంచలనంగా మారింది.
వైసీపీలు మేలు చేస్తాయా కీడా ?
జగన్ ఇలా విస్తృతంగా మార్పు చేర్పులు చేపడుతూండటంతో.. రాజకీయవర్గాల్లో ఓటమి భయం వల్లేనన్న ప్రచారం జరుగుతోంది. సామాన్య ప్రజలలోనూ ఇదే చర్చ జరుగుతోంది. భారీగా వ్యతిరేకత ఉండటం వల్లనే మారుస్తున్నారని టీడీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. దీనికి టీడీపీ కౌంటర్ ఇవ్వకపోతే.. ఆ ప్రచారం వైసీపీకి నష్టం చేసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.