టీడీపీ, జనసేన మధ్య ఆల్ ఈజ్ నాట్ వెల్ అన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి టీడీపీతో కలిసి బహిరంగ వేదికలపై కనిపిందుకు పవన్ కల్యాణ్ వెనుకాడున్నారు. అమరావితిక మద్దతుగా ఏర్పాటు చేసిన సభకు పవన్ కల్యాణ్ రారని తెలియడంతో సభను రద్దు చేసుకున్నారు. యువగళం పాదయాత్ర చేసిన లోకేష్ ముగింపు సభను భారీగా నిర్వహిస్తున్నారు. దానికి పవన్ ను ఆహ్వానించారు మొదట వస్తానన్న ఆయన .. తర్వాత రానని చెప్పేశారు.
ముందస్తు కమిట్‌మెంట్లు ఉన్నాయన్న జనసేన
టీడీపీ యువనేత లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభకు పవన్ కల్యాణ్ హాజరు కావడం లేదు. గతంలో పదిహేడో తేదీన బహిరంగసభ ఖరారు చేశారు. కానీ తుపాను కారణంగా పాదయాత్రకు మూడు రోజులు పాటు విరామం ఇవ్వాల్సి రావడంతో ఇరవయ్యో తేతీనసభను ఖరారు చేశారు. ఏర్పాట్లు భారీగా చేస్తున్నారు. ఎన్నికల సన్నాహాక సభగా కావడంతో ఏర్పాట్లు భారీగా చేస్తున్నారు.
ముందస్తు కార్యక్రమాల వల్లనే పవన్ కల్యాణ్ సభకు హాజరు కావడం లేదని టీడీపీ, జనసేన వర్గాలు చెబుతున్నాయి. కాన పవన్ అన్ని షూటింగులు క్యాన్సిల్ చేసుకున్నారు. ఆయనకు పనులేమీ లేవని.. రాజకీయ కార్యక్రమాలే ఉన్నాయని అంటున్నారు.
లోకేష్‌కే హైప్ రావడానికి టీడీపీ పవన్ ను రాకుండా చేసిందా ?
అదే సమయమంలో టీడీపీ నేతలు కూడా.. ఇది యువగళం ముగింపు సభ కాబట్టి.. లోకేష్‌కు క్రెడిట్ ఇచ్చేలా పూర్తస్థాయిలో సభ జరిగితే బాగుంటుందని అనుకుంటున్నారు. దానికి తగ్గట్లుగానే సన్నాహాలు, ప్రచారం చేస్తున్నారు. పవన్ రాకపోవడం కూడా ఒకందుకు మంచిదే అనుకుంటున్నారని.. అసలు పవన్ రాకుండా చేసింది కూడా టీడీపీ వాళ్లేనన్న సెటైర్స్ వినిపిస్తున్నాయి. పవన్ కూడా .. టీడీపీ విషయంలో అంత సంతృప్తిగా లేరని.. టీడీపీ ఉద్దేశం తెలియగానే ఆయన తాను రానని చెప్పేశారని అంటున్నారు
సీట్ల విషయంలో తేడాలు వచ్చేశాయా ?
సీట్ల సర్దుబాటుపై జనసేనతో చర్చలు జరుగుతున్నాయి. కానీ జనసేనకు ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వడం లేదని అతి తక్కువ సీట్లు ఆఫర్ చేస్తున్నారని అంటున్నారు. అందులోనూ గెలిచే సీట్లు తక్కువ ఉన్నాయని చెబుతున్నారు. ఈ కారణంగా రెండు పార్టీల మధ్య ఆల్ ఈజ్ ఈజ్ నాట్ వెల్ అన్న పరిస్థితులు ఉన్నాయంటున్నారు.