హిందూపురం పార్లమెంట్‌పై బీజేపీ ప్రత్యేక దృష్టి – హైకమాండ్ నుంచి సంకేతాలు అందాయా ?

హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గంపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. ఆ నియోజకవర్గంలో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి. ఇటీవలస ఏడు నియోజకవర్గాల కార్యవర్గాలను అప్రమత్తం చేసి.. విద్యుత్ చార్జీల పెంపుపై ఉద్యమానికి రెడీ అయ్యారు. వారం రోజుల పాటు నియోజకవర్గం మొత్తం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయనున్నారు.

నియోజకవర్గంపైనే ప్రత్యేక దృష్టి పెట్టిన విష్ణువర్ధన్ రెడ్డి

గతంలో రాష్ట్ర స్థాయి బాధ్యతలతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే అక్కడ కూడా అలుపెరకుండా బాధ్యతలు నిర్వర్తించే విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పుడు హిందూపురం పార్లమెంట్ పైనే ప్రత్యేక దృష్టి పెట్టారు. వచ్చే అక్కడే పని చేసుకోవాలని ఆయనకు హైకమాండ్ నుంచి సంకేతాలు అందాయని చెబుతున్నారు పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ హైకమాండ్ ప్రత్యేక వ్యూహాలను అవలంభిస్తోంది. ఇందులో భాగంగా మిషన్ సౌత్ ను ఏర్పాటు చేసుకుని బీజేపీకి మంచి అవకాశాలు ఉన్న నియోజకవర్గాలను ఎంపిక చేసి ముందుగానే కొంత మంది నేతలకు పని చేసుకోవాలని సూచిస్తున్నారు. అందులో హిందూపురం కూడా ఒకటని భావిస్తున్నారు.

ఏపీలో పొత్తులపై ఢిల్లీలో విస్తృత చ్చలు

ఏపీలో పొత్తుల వ్యవహారంపై ఢిల్లీలో విస్తృత చర్చలు జరుగుతున్నాయి. అయితే అన్నీ గుంభనంగా ఉంటున్నాయి. ఈ క్రమంలో ఏపీలో ఏపీ నుంచి ఎన్డీఏలోకి ఓ బలమైన పార్టీ వస్తుందని చెబుతున్నారు. అది ఏ పార్టీ అన్నది స్పష్టత లేకపోయినా.. . పార్లమెంట్ నియోజకవర్గాల విషయంలో బీజేపీకి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలో బీజేపీ హైకమాండ్ ఎంపిక చేసిన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టారని అనుకోవచ్చు.

పొత్తులున్నా లేకపోయినా విష్ణువర్ధన్ రెడ్డి బలమైన అభ్యర్థి అవుతారని అంచనా

హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గంలో పొత్తులు ఉన్నా లేకపోయినా విష్ణువర్ధన్ రెడ్డి బలమైన అభ్యర్థి అవుతారన్న అంచనా ఉంది. విద్యార్థి నేతగా అక్కడి వారందరికీ.. విష్ణు పరిచితమే. అన్ని నియోజకవర్గాల్లో అన్ని పార్టీల్లోనూ విష్ణు అని ఆప్యాయంగా పిలిచే నేతలున్నారు. అలాగే సామాన్య ప్రజలు కూడా విష్ణు అంటే అభిమానం చూపిస్తారు. ఆయన పొత్తులు ఉన్నా లేకపోయినా బీజేపీకి బలమైన అభ్యర్థి అవుతారన్న అంచనాలు సహంజగానే వస్తున్నాయి.