ఏపీలో యాక్టివ్ అవుతున్న వెటరన్ లీడర్స్ – వారు బీజేపీలో చేరబోతున్నారా ?

ఉత్తరాంధ్రలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి మాజీ ఎంపీ కొణతాల రామక్రిష్ణ కొంత కాలం సైలెంట్ గా ఉన్నారు. కాంగ్రెస్ లో రెండు దశాబ్దాల పాటు ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయాలను శాసించారు. ఆ తరువాతనే ఆయనకు కష్టాలు మొదలయ్యాయి. 2009లో ఆయన మంత్రిగా ఉండి అనకాపల్లిలో ఓడారు. ఆ తరువాత వైఎస్సార్ మరణంతో కొణతాల రాజకీయం మసకబారుతూ వచ్చింది.

వైసీపీలో కుదురుకోలేకపోయిన కొణతాల

అంటే గత పదిహేనేళ్ళుగా ఆయన ఏ పదవిలోనూ లేక ఏ పార్టీలోనూ కుదురుగా లేక ఇబ్బంది పడుతున్నారు. వైఎస్సార్ మరణానంతరం కొణతాల వైసీపీలో చేరారు. కానీ అక్కడ ఆయన ఉండలేకపోయారు. ఇక 2019 ఎన్నికల ముందు టీడీపీకి మద్దతు ప్రకటించిన ఆయన ఆ పార్టీలోనూ కొనసాగలేదు ఇపుడు 2024 ఎన్నికలు వస్తున్నాయి. ఒక విధంగా చూస్తే కొణతాల రాజకీయ జీవితానికి ఇవి చివరి ఎన్నికలు అని అంటున్నారు. అందుకే ఆయన ఈసారి సరైన రాజకీయ నిర్ణయం తీసుకుని పోటీ చేయాలని చూస్తున్నారని చెబుతున్నారు.

బీజేపీ వైపు చూసే అవకాశం !

వైసీపీ, టీడీపీలో ఆయన సర్దుకోలేకపోయారు. అందుకే ఆయన బీజేపీపీలో చేరుతారు అని ప్రచారం అయితే సాగుతోంది. ఆయన రాజకీయంగా యాక్టివ్ గా లేకపోవడం వల్ల బీజేపీలో ఆయన ఎంత మేర ప్రభావం చూపగలరనన చర్చ నడుస్తోంది. కొణతాల అనకాపల్లి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. కానీ ఆయన బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపించడానికి ఏదో ఓ ప్రధాన పార్టీతో పొత్తు ఉంటుందని నమ్మడం కారణం అంటున్నారు. అలా కుదరకపోతే జనసేన పార్టీలో చేరే అవకాశం ఉంది.

క్రియాశీలకంగా లేకపోవడమే సమస్య

అంగబలం అర్ధబలం ఉన్న వారినే ఏరి కోరి మరీ ఎంపీ సీటుకు ప్రధాన పార్టీలు పోటీ పెట్టనున్నాయి. ఆయన దశాబ్దన్నర కాలంగా రాజకీయంగా అంత క్రియాశీలకంగా లేరు కాబట్టి మైనస్ కావొచ్చు. . ఏది ఏమైనా కొణతాల అభిమానులు మాత్రం తమ నాయకుడు సరైన టైం లో రీ ఎంట్రీ ఇస్తారు అని అంటున్నారు. మరి ఆయన బీజేపీలో చేరుతారా లేక తన పూర్వపు పార్టీ అని వైసీపీని ఎంచూంటారా అన్నది అయితే ప్రస్తుతానికి క్లారిటీ లేదు.