తియ్య తియ్యగా పుల్ల పుల్లగా ఉండే ద్రాక్షపళ్లు అంటే చాలా ఇష్టంగా తింటారు. వీటిలో నలుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో ఉన్నాయి. ఖరీదు సంగతి పక్కనపెడితే..ఈ మూడు రంగుల ద్రాక్షల్లో ఆరోగ్యానికి ఏ రంగు ద్రాక్ష మంచిది? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో చూద్దాం..
ఎర్ర ద్రాక్ష
ఎర్ర ద్రాక్ష తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది. రేటు ఎక్కువే. ఇది జామ్ , జెల్లీని తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఒక ఎర్ర ద్రాక్షలో 104 కేలరీలు, 1.1 గ్రాముల ప్రోటీన్, 0.2 గ్రాముల కొవ్వు, 27.3 గ్రాముల పిండి పదార్థాలు, విటమిన్ సి మరియు విటమిన్ కె ఉన్నాయి.
ఆకుపచ్చ ద్రాక్ష
ఆకుపచ్చని ద్రాక్షని చాలా ఇష్టంగా తింటారంతా. ధర కూడా అందరకీ అందుబాటులో ఉంటుంది. ఆకుపచ్చని ద్రాక్ష కొన్ని తియ్యగా ఉంటాయి, కొన్ని పుల్లగా ఉంటాయి. ఓ అధ్యయనం ప్రకారం..1 కప్పు ఈ ద్రాక్షలో సుమారు 104 కేలరీలు, 1.4 గ్రాముల ప్రొటీన్, 0.2 గ్రాముల కొవ్వు, 27 గ్రాముల పిండి పదార్థాలు, విటమిన్ సి, విటమిన్ కె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. విటమిన్ K రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది.
నల్ల ద్రాక్ష
నల్ల ద్రాక్షలో చాలా రకాలు ఉన్నాయి. పుల్లనివి, తియ్యటివి రెండూ ఉంటాయి. సీడ్ , సీడ్ లెస్ కూడా వచ్చాయిప్పుడు. ఈ నల్లటి ద్రాక్షను ఎక్కువగా వైన్ తయారీలో వినియోగిస్తారు. 1 కప్పు నల్ల ద్రాక్షలో సుమారు 104 కేలరీలు, 1.1 గ్రాముల ప్రోటీన్, 0.2 గ్రాముల కొవ్వు ఉంటుంది. ఇందులో విటమిన్ కె , సి కూడా ఉన్నాయి. నల్ల ద్రాక్ష క్యాన్సర్ కణాలను నివారిస్తుంది ఈ ద్రాక్ష క్యాన్సర్(Cancer) కణాలను నివారిస్తుంది.
ఏ ద్రాక్షలో ఆరోగ్యానికి మంచిది!
పళ్లు ఏవైనా ఆరోగ్యానికి మంచిదే..అలాగే అన్ని రకాల ద్రాక్షలోనూ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ నలుపు, ఎరుపు ద్రాక్షలో మూడు రకాల పాలీఫెనాల్స్ ఉన్నాయి. ఇవి క్యాన్సర్‌ను నివారించడానికి, గుండె ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. ఓవరాల్ గా ఆకుపచ్చ ద్రాక్ష కన్నా నలుపు, ఎరుపు ద్రాక్షలో కొంచెం ఎక్కువ పోషకాలుంటాయి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.