హైట్ అవ్వాలంటే డైలీ ఇవి తినండి!

సాధారణంగా హైట్ అనేది జీన్స్ పై ఆధారపడి ఉంటుంది. పురుషులైతే ఆరడుగులు, స్త్రీలు అయితే ఐదున్నర అడుగుల ఎత్తువరకూ ఉండాలని కోరుకుంటారు. సాధారణంగా పురుషులు 20 నుంచి 21 సంవ‌త్స‌రాల వ‌ర‌కు హైట్ పెరిగితే… స్త్రీలు 19 సంవత్సరాల వరకూ హైట్ అవుతారు. పిల్లలు వెయిట్ తో పాటూ హైట్ పెరగాలంటే ఆహారంలో తగిన మార్పులు చేర్పులు అవసరం అంటారు ఆరోగ్య నిపుణులు .

తగినంత విటమిన్ డి
గ్రోత్ హార్మోన్ ను థైరాయిడ్ గ్రంథి విడుద‌ల చేస్తుంది. అందుకే థైరాయిడ్ గ్రంథి ప‌నితీరును మెరుగుప‌రిచే ఆహారాల‌ను తీసుకోవాలి. అలాగే శ‌రీరానికి త‌గినంత విట‌మిన్ డి అందేలా చూసుకోవాలి. రోజూ ఎండ‌లో ఉండే ప్ర‌య‌త్నం చేయాలి. ఎండ‌లో ఉండ‌డం కుద‌ర‌ని వారు విట‌మిన్ డి క్యాప్సుల్స్ ను ఉప‌యోగించాలి.

కాల్షియం ఉండే ఆహారాలు
క్యాల్షియం ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. 20 సంవ‌త్స‌రాల లోపు ఉండే వారు రోజుకు 600 మిల్లీగ్రాముల క్యాల్షియం శ‌రీరానికి అందేలా చూసుకోవాలి. ఎదిగే వ‌య‌సులో ఉండే పిల్లలు శ‌రీరానికి త‌గినంత ప్రోటీన్ కూడా అందేలా ఆహారం ఉండాలి. కిలో బ‌రువుకు రెండు గ్రాముల ప్రోటీన్ చొప్పున తీసుకోవాలి. నాన‌బెట్టిన ప‌ల్లీలు, మొల‌కెత్తిన గింజ‌లను, పుచ్చ‌గింజ‌ల ప‌ప్పును, పొద్దు తిరుగుడు ప‌ప్పును, గుమ్మ‌డి గింజ‌ల ప‌ప్పును, బాదంప‌ప్పును తీసుకోవాలి. అలాగే వారానికి రెండు సార్లు మీల్ మేక‌ర్ తినడం మంచిది . ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి త‌గినంత ప్రోటీన్ ల‌భిస్తుంది.

యోగాసనాలు
సరైన ఆహారం తీసుకుంటూనే…థైరాయిడ్ గ్రంథి ప‌నితీరును పెంచే స‌ర్వాంగాస‌న్, చ‌క్రాస‌న్, మ‌త్సాస‌న్, యోగా ముద్రాస‌న్ వంటి ఆస‌నాల‌ను చేయాలి. వీటితో పాటు రోజూ గంట పాటు వ్యాయామం చేయాలి. ఇలా ఆహారాల‌ను తీసుకుంటూ వ్యాయామం చేయ‌డం వ‌ల్ల , సైకిల్ తొక్కటం, స్కిప్పింగ్ ఆడటం వలన కూడా మంచి ఫలితం ఉంటుంది. .

ఈ ఆహారాలు హైట్ పెంచుతాయి
ఉసిరికాయ సంబంధిత ఆహారాలు రోజూ తీసుకోవటం వల్ల ఎత్తు పెరగటానికి సహాయపడుతుంది. ఇందులో ఉన్న సి విటమిన్, పాస్ఫరస్, కాల్షియం, మినరల్స్ పొడవు పెరగటానికి తోడ్పడతాయి. గుమ్మడికాయను మెత్తగా ఉడకబెట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు దానికి కొంచెం పటికబెల్లం పొడిని, కొంచెం తేనెను కలిపి ప్రతిరోజు టిఫిన్ తినే సమయంలో రెండు స్పూన్ల చొప్పున తినటం వల్ల పొడవును పెంచే టిష్యూలను బిల్డప్ అవుతాయి. రోజు గ్లాసు పాలలో కొద్దిగా బెల్లం, మిరియాలు, అశ్వగంధ పొడి కలిపి రాత్రిపూట త్రాగాలి. ఇలా 3 నెలల పాటు క్రమం తప్పకుండా చేయటం వలన మంచి ఫలితాన్ని పొందవచ్చు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.