బుద్దా వెంకన్న ప్లాన్ బీలో ఏ పార్టీ ఉంది ? టీడీపీకి షాకివ్వడం ఖాయమేనా ?

2024 ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి టికెట్లు ద‌క్కించుకునేందుకు టీడీపీ నాయ‌కులు బ్లాక్ మెయిలింగ్ కు దిగుతున్నారు. తమకు ప్లాన్ బీ ఉందంటున్నారు. తాజాగా బుద్దా వెంకన్న కూడా అదే అంటున్నారు. నాయ‌కులు టికెట్ ఇస్తే త‌ప్ప‌.. పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొనేది లేన‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నా రు. ఇలాంటి వారికి పార్టీ అధినేత చంద్ర‌బాబు త‌ర‌చుగా వాత‌లు పెడుతూనే ఉన్నారు. హెచ్చ‌రిస్తూనే ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ.. నాయ‌కులు మాత్రం మార‌డం లేదు.

తనకు టిక్కెట్ ఇవ్వాల్సిందేనంటున్న బుద్దా వెంకన్న

మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న సంచ ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఉత్త‌రాంధ్ర జిల్లాల టీడీపీ ఇంచార్జ్‌గా కూడా ఉన్న ఆయ‌న‌.. అనూహ్యంగా విజ‌య వాడ ప‌శ్చిమ టికెట్‌పై క‌న్నేశారు. గ‌త ఎన్నిక‌ల్లోనే ఈ టికెట్ వ‌స్తుంద‌ని ఆశించిన ఆయ‌న‌కు అనూహ్యం గా దెబ్బ‌త‌గిలింది.అయితే, ఇప్పుడు జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో మాత్రం ఖ‌చ్చితంగా టికెట్ ద‌క్కించుకోవాల‌ని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ ప‌శ్చిమ టికెట్‌ను త‌న‌కే కేటాయించాల‌ని కోరారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇవ్వ‌క‌పోతే.. త‌న ద‌గ్గ‌ర ప్లాన్ బి కూడా ఉంద‌ని హెచ్చ‌రించారు.

జనసేనకు విజయవాడ పశ్చిమ టిక్కెట్

నిజానికి పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ టిక్కెట్ జనసేనకు కేటాయించారు. ఇంకా అధికారిక ప్రకటన చేయకపోయినా అక్కడ జనసేన నేత పోతిన మహేష్ ప్రచారం కూడా చేసుకుంటున్నారు. ఈ విషయం బుద్దా వెంకన్నకు తెలియనిదేం కాదు. అయినా ఆయన తనకు టిక్కెట్ డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ప్లాన్ బీ ఉందంటున్నారు. సీనియ‌ర్లు. బీసీ.. (న‌గ‌రాలు కులం) సామాజిక వ‌ర్గానికి చెందిన బుద్ధా వెంక‌న్న పార్టీలో యాక్టివ్‌గానే ఉన్నారు. చంద్ర‌బాబుకు అనుకూల నాయ‌కుడిగా.. పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా వైసీపీ నేత‌ల‌పై విరుచుకుప‌డ‌డంలోనూ ఆయ‌న ముందున్నారు. కానీ ఇప్పుడాయన మాటల్లో తేడా కనిపిస్తోంది.

వేరే పార్టీలతో టచ్ లోకి వెళ్లారా ?

గ‌తంలో చంద్ర‌బాబు ఆయ‌న‌కు ఎమ్మెల్సీగా అవ‌కాశం ఇచ్చారు. త‌ర్వాత‌.. ఉత్త‌రాంధ్ర జిల్లా పార్టీ ఇంచార్జ్‌గా బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఇంత చేసినా.. ఇప్పుడు అధినేతకు చెప్పారో లేదో తెలియ‌దు కానీ.. వెస్ట్ సీటును మాత్రం ఇచ్చేయాల‌ని ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. ఇవ్వ‌క‌పోతే.. ప్లాన్ బి అంటూ.. బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. ఆయనకు కేశినేనితో పాటు ఇతర వర్గం నేతలతో పడదు. అందుకే ఇప్పటికే ఇతర పార్టీలతో టచ్ లోకి వెళ్లారని అందుకే ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని అంటున్నారు.