రైల్వే జోన్‌కు భూమి ఇవ్వనిది ఏపీ సర్కారే – కేంద్రం చెప్పిన సంచలన నిజం !

ఐదేళ్ల కిందట ఎన్నికలకు ముందు విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇప్పటి వరకూ అడుగుముందుకు పడలేదు. దీనికి కారణం ఏమిటో కేంద్రం పార్లమెంట్ లో చెప్పింది. కావాల్సిన భూమిని ఏపీ సర్కార్ కేటాయించాల్సి ఉండగా కేటాయించడం లేదు. కానీ కేంద్రంపై విమర్శలు చేయడానికి వైసీపీ నేతలు ముందు ఉంటున్నారు.

రైల్వే భూమి తీసుకున్న ఏపీ ప్రభుత్వం

రైల్వేకి అవసరమున్నప్పుడు ఇస్తామని చెప్పి రైల్వేకి చెందిన 53ఎకరాలు ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు రైల్వే జోన్ కోసం 150 ఎకరాల భూమి అవసరం . కానీ ప్రభు్తవం ఇవ్వడం లేదు. 150 ఎకరాల భూమి త్వరగా గుర్తించి ఇవ్వాలని రైల్వే కోరుతోంది. గత ఎన్నికలకు ముందు హడావుడిగా విశాఖ రైలై జోన్‌ను ప్రకటించిన కేంద్రం తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. విశాఖ రైల్వే జో‌న్ పనులు అసలు ప్రాథమికంగా కూడా ప్రారంభం కాలేదు. భూమి కోసం ఎన్ని సార్లు గుర్తు చేసినా ప్రభుత్వం స్పందించ లేదు.

భూమి ఇస్తే శరవేగంగా ఏర్పాటు

విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు అన్ని అవకాశాలు ఉన్నాయి. భూమి ఇస్తే చాలని డీపీఆర్‌లో ఇప్పటికే ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రైల్వేజోన్‌ను ఏర్పాటుచేసేందుకు విశాఖలో కొన్ని భవనాలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం భూములు ఇవ్వడం లేదు. వైసీపీకి రైల్వేజోన్ రావడం ఇష్టం లేదన్నట్లుగా పరిస్థితి మారింది. ఇలా ఎందుకు చేస్తున్నారో కేంద్ర ప్రభుత్వ వర్గాలకూ అంతు చిక్కడం లేదు. బీజేపీ ఏమీ చేయడం లేదని విమర్శించడానికి భూమి ఇవ్వడం లేదన్న వాదన కూడా వినిపిస్తోంది.

గతంలో మంత్రి అమర్నాథ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన విష్ణు

గతంలో రైల్వే జోన్ విషయంలో బీజేపీపై విమర్శలు చేసిన మంత్రి అమర్నాథ్ కు ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. రైల్వే జోన్ కు నిధులు మంజూరు చేస్తే క్షణాల్లో భూమి ఇప్పిస్తామని ఆయన సవాల్ చేశారు. కానీ జోన్ ఎప్పుడో మంజూరు అయిన విషయాన్ని ఆయన చెప్పలేదు. దీన్నే గుర్తు చేసి విష్ణువర్థన్ రెడ్డి .. భూమి ఇప్పించాలని సవాల్ చేశారు. ఆయన కు ప్రభుత్వంలో కనీస పలుకుబడి లేదు కానీ భూమి ఇప్పిస్తానని సవాల్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.