అనంతపురం జిల్లా రాజకీయం మారుతోంది. వైసీపీ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా మారుతోంది. వైసీపీ టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టే ప్రయత్నం చేయడంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అదే ప్లేస్ లో పటేల్ విగ్రహం పెడతామని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ప్రకటించడం సంచలనంగా మారింది. ముందు ముందు ఈ రాజకీయం మరింత వేడెక్కనుంది.
అనంతపురంలో వైసీపీ మత రాజకీయం
అనంతపురం లో వైసీపీ మత రాజకీయానికి పాల్పడుతోంది బీజేపీ గతంలో నగరంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెడతామని అధికారులకు దరఖాస్తు చేసింది. కానీ నిబంధనల పేరుతో అనుమతి ఇవ్వలేదు. హఠాత్తుగా డిప్యూటీ మేయర్ అదే స్థలంలో టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టడానికి భూమిపూజ చేశారు. ఇది వివాదాస్పదమయింది. బీజేపీ నేతలు ఉద్యమం ప్రారంభించారు. గతంలో ప్రొద్దుటూరులో ఇదే ప్రయత్నం చేయడంతో.. విష్ణవర్ధన్ రెడ్డి పోరాటాలు చేసినిలుపుదల చేయించారు. ఇప్పుడు కూడా ఆయనే రంగంలోకి దిగారు. వైసీపీకి గట్టి చాలెంజ్ విసిరారు.
టిప్పు సుల్తాన్ విగ్రహ శంకుస్థాప చేసిన చోటే పది రోజుల్లో పటేల్ విగ్రహం
ఓటు బ్యాంకు రాజకీయాల ముసుగులో శాంతి భద్రతల ఘర్షణ వాతావరణం ఏర్పడే విధంగా వైసీపీ చేస్తూండటంతో బీజేపీ సీరియస్గా స్పందించింది . 10 రోజుల్లో బీజేపి అదే స్థలంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెడతామని సవాల్ చేశారు. ఎవరు అడ్డుకుంటారో చూస్తామని విష్ణు సవాల్ చేశారు. నిజానికి అనంతపురం అర్బన్ వైసీపీ టికెట్ కోసం విగ్రహాల వివాదం తెరమీదకు తెచ్చినట్లుగా వైసీపీలోనే ప్రచారం జరుగుతోంది. ఏపీలో ఎక్కడా లేని టిప్పు సుల్తాన్ విగ్రహం అనంతపురం లో ఎందుకు… కనీసం ఆయన పుట్టిన మైసూర్ లో కూడా లేదని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేస్తున్నారు.
అనంతపురంలో ఇక వైసీపీతోనే బీజేపీ పోరు
అనంతపురంలో విగ్రహ వివాదంతో వైసీపీ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా రాజకీయం మారుతోంది. టీడీపీ కూడా విగ్రహ వివాదంలో సైలెంట్ గా ఉంది. వారు కూడా ముస్లిం ఓట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ కారణం గా హిందూ సెంటిమెంట్లు దెబ్బతింటున్నాయి. విష్ణు బీజేపీ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి.