తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ఒక్క గ్రేటర్ లో మినహా ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపించలేదు. ఇతర చోట్ల బీజేపీ బాగా బలపడింది. కొన్ని వ్యూహాత్మక తప్పిదాల వల్ల బీజేపీ కాస్త వెనుకబడింది కానీ.. ఇంకా మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉందని విశ్లేషణలు వస్తున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉనికిని కాపాడుకోవడం కష్టమన్న అభిప్రాయం రాకీయవర్గాల్లో ఎక్కువగా వినిపిస్తోంది.
బీఆర్ఎస్ ను అంటి పెట్టుకుని ఉండే ఎమ్మెల్యేలు ఎవరు ?
బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన వారిలో ఎవరూ ఉద్యమకారులు లేరు. కేసీఆర్ అంటే పడిపోయే వీరాభిమానులు లేరు. ఉన్న వాళ్లంతా బంగారు తెలంగాణ బ్యాచ్. వారు మాత్రమే గెలిచారు. కేసీఆర్ పవర్ లోకి వచ్చాక అధికారం కోసమే వారు కేసీఆర్ దగ్గరకు చేరారు. వారిలో నియోజకవర్గ అభివృద్ధి కోసం … కాంగ్రెస్ పార్టీలో చేరే ఎమ్మెల్యేల సంఖ్య తక్కువ ఉండదని భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ లోకి పోలేని వారు బీజేపీ వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కొంత మంది బీజేపీతో టచ్ లోకి వచ్చారని అంటున్నారు.
బలంగా తెర ముందుకు వచ్చిన బీజేపీ
భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు తెలంగాణలో బేస్ వచ్చింది. ఉత్తర తెలంగాణలో గట్టిపోటీ ఇస్తోంది. బీఆర్ఎస్ ఓట్లను ఆ పార్టీనే ఎక్కువగా కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ ఎంత బలహీనం అయితే బీజేపీ అంత బ లపడుతుంది. . ఈ విషయంలో కేసీఆర్ బీజేపీ రాజకీయాలను తట్టుకోలేరని అంటున్నారు. కేటీఆర్ కు పార్టీ నడిపే సామర్త్యం లేదని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. కేటీఆర్ ఇప్పటి వరకూ అధికార పార్టీ నేతగా ఉన్నారు. ప్రతిపక్ష నేతగా కేటీఆర్ ఇంత వరకూ పని చేయలేదు. ఆయన పార్టీని నడపడం… రేవంత్ నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడం చిన్న విషయం కాదు. బీజేపీ నుంచి ఎదురయ్యే సవాళ్లనూ ఆయన అధిగమించలేరు.
బీజేపీకి గోల్డెన్ చాన్స్ – పార్లమెంట్ ఎన్నికల్లోపే కీలక పరిణామాలు
బీజేపీకి తెలంగాణలో ఇప్పుడు గోల్డెన్ చాన్స్ లభిచింది. బీఆర్ఎస్ ను తన ప్రమేయం లేకుండా బలహీనడేలా చేయగలిగితే లబ్ది పొందేది బీజేపీనే. మొత్తంమగా కేసీఆర్ గడ్డు ప రిస్థితిని ఎదుర్కొంటున్నారు. పార్టీని నిలుపుకోవడం చిన్న విషయం కాదు. ఈ పరిస్థితి తెచ్చుకున్నది ఆయనేనని అంటున్నారు. సరైన సమయం చూసి రాజకీయాలు చేయడంలో బీజేపీ హైకమాండ్ ను మించిన వారు లేరు.అందుకే ఇప్పుడు ఆ పార్టీ తెలంగాణలో ఎలాంటి రాజకీయ వ్యూహం అమలు చేయబోతోందనేది ఆసక్తికరంగా మారింది.