డయాబెటిస్ రోగులకు సూపర్ ఫుడ్ ఇది

డయాబెటిస్ రోగులు రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆహారం దగ్గర్నుంచి మందుల వరకూ అన్ని విషయాల్లోనూ స్పెషల్ కేర్ తీసుకుంటారు. అయితే డైట్ పర్ ఫెక్ట్ గా ఉన్నప్పుడే డయాబెటిస్ మాత్రమే కాదు ఎలాంటి అనారోగ్యమూ దరిచేరదు…ముఖ్యంగా శీతాకాలంలో దొరికే గుమ్మడికాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. పూర్వకాలం ఇలాంటి కూరగాయలను రెగ్యులర్ గా ఆహారంలో భాగంగా చేసుకునేవారు..అందుకే ఏళ్లతరబడి ఆరోగ్యంగా జీవించారు.

క్యాన్సర్ ప్రమాదం ఉండదు
గుమ్మడికాయలో లుయెటిన్ , జెక్సాంటిన్, యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి, ఇవి హానికరమైన UV కిరణాల నుండి చర్మాన్ని రక్షించటంలో సహాయపడతాయి. ఇందులో ఉండే కెరోటినాయిడ్ కంటెంట్ వల్ల రొమ్ము, కడుపు, గొంతు ,ప్యాంక్రియాస్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.

గుండెకు మంచిది
గుమ్మడికాయ గింజలు మెగ్నీషియం కలిగి ఉంటాయి. రక్తపోటును నియంత్రించడంతో పాటు వివిధ శారీరక క్రియలకు అవసరపడతాయి. గుండెకు మేలు చేసే మంచి కొవ్వులను పెంచటంలో ఉపకరిస్తాయి. రోగనిరోధక వ్యవస్ధకు సూపర్‌ ఫుడ్ ఇవి. వీటిలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌లు ఉంటాయి. కంటి చూపును మెరుగుపర్చే విటమిన్ సి గుమ్మడికాయలో ఉంటుంది.

బరువు తగ్గడం
గుమ్మడికాయల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. అధిక మొత్తంలో కేలరీలను తీసుకోవటాన్ని నిరోధించవచ్చు. తద్వారా బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

డయాబెటిక్ రోగులకు మంచిది
గుమ్మడికాయ గ్లూకోజ్ నియంత్రణలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడంలో , గ్లూకోస్ టాలరెన్స్‌ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అందుకే మధుమేహం ఉన్నవారికి గుమ్మడి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే కాల్షియం ఎముకలు ఆరోగ్యానికి, దంతాల నిర్మాణానికి సహాయపడతాయి.

మంచి నిద్ర
గుమ్మడి గింజల్లో ట్రిప్టోఫాన్‌ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది సెరటోనిన్‌ అనే రసాయనం ఉత్పత్తి కావటానికి తోడ్పడుతుంది. సెరటోనిన్‌ హాయి భావనను కలిగించటంలోనే కాదు.. నిద్ర కూడా బాగా పట్టేలా చేస్తుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.