తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ అని ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ వచ్చాయి కానీ తిరుగులేని మెజార్టీతో అధికారం దక్కుతుందని ఎవరూ చెప్పలేదు. అదే సమయంలో బీజేపీకి తొమ్మిది నుంచి పన్నెండు అసెంబ్లీ సీట్లు వస్తాయని తేల్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి డబుల్ డిజిట్ వస్తాయని అత్యధిక సర్వేలు తేల్చాయి. కాస్త లోతుగా పరిశీలిస్తే… బీజేపీకి డబుల్ డిజిట్ అంటే.. ప ది సీట్లు వస్తే.. కాంగ్రెస్ పార్టీ విజయానికి దూరమైనట్లే. తెలంగాణలో బీజేపీ కింగ్ మేకర్ అయినట్లే.
బీజేపీకి పది సీట్లు వస్తే రెండు పార్టీలకూ మెజార్టీ లేనట్లే
తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో సాధారణ మెజార్టీ 60 స్థానాలు. పాతబస్తిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో మజ్లిస్ తప్ప వేరే పార్టీకి చాన్స్ లేదు. అంటే 112 స్థానాల్లో వీటిలో అరవై సీట్లు రెండు పార్టీలో ఒకటి తెచ్చుకోవాలి. కానీ వీటిలో పన్నెండు స్థానాలు బీజేపీకి వస్తాయి. కనీసం పది వస్తాయనుకుందాం. అంటే 102 స్థానాల్లో మాత్రమే రెండు పార్టీలు సీట్లు పంచుకుని అధికారంలోకి రావాలి. కానీ ఎగ్జిట్ పోల్స్ ఏ పార్టీకి కూడా అరవై సీట్లు నిఖార్సుగా ఇవ్వలేదు. బీఆర్ఎస్ కు నలభై ఐదు.. కాంగ్రెస్‌కు యాభై కు కాస్త ఎక్కువ సీట్లు ఇచ్చాయి. ఉన్న స్థానాల ప్రకారం అది కరెక్ట్ లెక్క. అంటే.. హంగ్ ఖాయమని అర్థం చేసుకోవచ్చు.
బీజేపీతో కలిసే పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది !
బీఆర్ఎస్ పార్టీకి యాభై సీట్ల వరకూ వస్తాయని అంచనా. కాంగ్రెస్ పార్టీకి యాభై మూడు, యాభై నాలుగు సీట్లు రావొచ్చు. కానీ ప్రభుత్వం ఏర్పాటు మాత్రం బీజేపీ చేతిలో ఉంటుంది. బీజేపీ కలిస్తే ప్రభుత్వం ఏర్పడుతుంది. కాంగ్రెస్ పార్టీ బీజేపీ మద్దతు కోరే చాన్స్ లేదు. కోరినా బీజేపీ ఇవ్వదు. బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే ఒకే ఒక్క అవకాశం బీజేపీతో కలవడం. ఇప్పటికే బీఆర్ఎస్ అగ్రనేతలు బీఆర్ఎస్ తో టచ్ లోకి వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. అంటే బీజేపీ కింగ్ మేకర్ అని బీఆర్ఎస్ కూడా గుర్తించినట్లే అన్నమాట.
ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయం కీలక మలుపులు
ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయ కీలక మలుపులు తిరిగే అవకాశం ఉంది. ఇది జాతీయ రాజకీయాల్లోనూ మార్పులు తీసుకు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్డీఏ మరింత బలోపేతం అవుతుంది. తెలంగాణలో పుంజుకున్నామని ఆశపడిన కాంగ్రెస్ కు.. ట్రాప్ లో పడ్డామని అప్పుడు తెలుస్తుందని బీజేపీ వర్గాలు సెటైర్లు వేస్తున్నాయి.