ఫ్రిజ్ లేని ఇల్లు ఈ రోజుల్లే లేదేమో. పైగా ఫ్రిజ్ నిల్వచేయని వస్తువూ లేదు. ఇవి ఫ్రిజ్ లో పెట్టొచ్చు, ఇవి పెట్టకూడదు అని లేదు… అన్నీ బాక్సుల్లో పెట్టి మూతపెట్టి ఫ్రిజ్ లలో తోసేస్తున్నారు. సాధారణంగా, పండ్లు, కూరగాయలను నిల్వ చేయడానికి ఫ్రిజ్ ఉపయోగిస్తారు. కొన్నింటిని మాత్రం అస్సలు ఫ్రిజ్ లో పెట్టకూడదు..అలాటి వాటిలో కట్ చేసిన ఉల్లిపాయలు ఒకటి. ముక్కలు చేసిన ఉల్లిపాయలను మాత్రం ఫ్రిజ్ లో పెట్టకూడదు శీతలీకరించడం వల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వస్తుంది. వీటిని తింటే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది
తరిగిన ఉల్లిపాయలను రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. వీటిని తింటే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే తరిగిన ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల దుర్వాసన వస్తుంది. ఆ వాసన ఫ్రిజ్‌లోని ఇతర ఆహార పదార్థాలకు వ్యాపిస్తుంది. ఫలితంగా, కూరగాయలు దాని రుచిని కూడా కోల్పోతాయి.
పోషక విలువలు తగ్గుతాయి
తరిగిన ఉల్లిపాయలు ఎక్కువ తేమ కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల ఉల్లిపాయ మెత్తగా మారుతుంది. అధిక తేమకు గురికావడం వల్ల వ్యాధికారకాలు వాటికి అంటుకుంటాయి. అలాగే ఉల్లిలో పోషక విలువలు కూడా తగ్గుతాయి. ఇవి బ్యాక్టీరియా పెరుగుదలకు దారితీస్తాయి. తరిగిన ఉల్లిపాయలు ఫ్రిజ్‌లోని చల్లని ఉష్ణోగ్రతతో పనిచేసే ఎంజైమ్‌లను కలిగి ఉంటాయి. ఈ ప్రతిచర్యలలో ప్రతి ఒక్కటి సల్ఫర్ సమ్మేళనాలు ఏర్పడటానికి దారితీస్తుంది. ఎందుకంటే ఉల్లిపాయల్లో సల్ఫర్ ఉంటుంది.
తొక్కతీసి కూడా ఉంచొద్దు
ఉల్లిపాయలను కోసి తొక్క తీసి నిల్వ ఉంచితే మరో ప్రమాదం పొంచి ఉంది. ఉల్లిపాయలు కోసినప్పుడు అనేక రకాల రసాయనాలు విడుదలవుతాయి. ఇవి బ్యాక్టీరియాను ఆకర్షించే పోషకాలుగా మారి వాటి పెరుగుదలకు కారణమవుతాయి. ఉల్లిపాయను నిల్వ చేయడానికి రిఫ్రిజిరేటర్‌లో కింద మూసివున్న కంటైనర్ ఉపయోగించండి.
నిజానికి చాలా రకాల పండ్లను కూడా ఫ్రిజ్‍లో పెట్టకూడదు. చాలా మంది అరటి పండ్లను కూడా ఫ్రిజ్‍లో పెడుతుంటారు. వీటిని గదిలో సాధారణ ఉష్ణోగ్రత దగ్గర పెడితే సరిపోతుంది. వాస్తవానికి కట్ చేసిన ఏదీ కూడా ఫ్రిజ్ లో పెట్టడం ఆరోగ్యానికి మంచిది కాదు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.