తెలంగాణలో ఎవరి ప్రచార జోరు ఎక్కువ ? బీజేపీ జోరును ఊహించలేకపోయారా ?

తెలంగాణలో ప్రచారం ముగిసింది. మైకులు మూగబోయాయి. ప్రచార సరళిని విశ్లేషిస్తే.. ఎవరు ఎంత భిన్నంగా చేశారు.. ఓటర్లపై ఎంత ప్రభావం చూపించారన్నది విశ్లేషించుకుంటే బీజేపీ ప్రచారంలో భిన్నత్వం కనిపించిందన్న అభిప్రాయం వినిపిస్తున్నాయి. ఏదో కూలీజనాలను తీసుకొచ్చాం.. భారీగా జన సమీకరణ చేశాం అన్నట్లుగా కాకుండా ఖచ్చితంగా ఓటు వేసే వర్గాలను ఆకట్టుకునేలా టార్గెటెడ్ గా బీజేపీ ప్రచారం జరిగింద్న అభిప్రాయం వినిపిస్తోంది.,

ప్రణాళికాబద్దంగా బీజేపీ ప్రచారం

బీజేపీ భారీ బహిరంగసభలు.. నియోజకవర్గానికో సభ అని లెక్కలు పెట్టుకోలేదు. అగ్రనేతలు వచ్చినప్పుడు సభలు, సమావేశాలు, ర్యాలీలు సహజంగానే ఉంటాయి. అందుకే రాష్ట్ర నేతలు ప్రత్యేకమైన ప్రచార ప్రణాళిక అనుసరించారు. .డోర్ టు డోర్ క్యాంపెయిన్ తో పాటు ప్రధాని మోదీ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఎంత ప్రయోజనం కలుగుతుందో వివరించే ప్రయత్నాలు చేశారు. పలు చోట్ల భారీ ర్యాలీలు నిర్వహించారు కానీ ఎక్కడా పెయిడ్ కూలీలు లేరు. పూర్తిగా స్వచ్చంద కార్యకర్తలతోనే ప్రచారం జరిగిపోయింది. ఇతర పార్టీలతో పోలిస్తే బీజేపీలో ఇదే ప్రత్యేకం అని చెప్పుకోక తప్పదు.

నేరుగా అత్యధిక మంది ఓటర్లను కలిసిన పార్టీ

నేరుగా అత్యధిక మందిని కలిసిన పార్టీగా బీజేపీ నిలిచింది. బీజేపీకి ప్రత్యేకమైన ప్రచార వ్యూహం ఉంది. ఆర్భాటం చేయడం వల్ల కంటే.. నేరుగా ఓటర్లను కలిసి ఓటు వేయమని అభ్యర్థించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇందు కోసం భిన్నమైన కమిటీలు వేశారు. బీజేపీలోని అన్ని స్థాయి వర్గాలు ఈ ప్రచారాన్ని చేశాయి. కేంద్రం… ప్రత్యేకంగా నియమించిన ఇరవై ఆరు మంది సభ్యుల కమిటీ కూడా నియోజకవర్గాల వారీగా విస్తృతంగా ప్రచారం చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో విష్ణువర్ధ్ రెడ్డి నేతృత్వంలో ప్రచారం సాగింది. సెటిలర్లతో పాటు ఇతర వర్గాలను ఆకట్టుకోవడానికి తీవ్రంగా శ్రమించారు.

అగ్రనేతల ప్రచారంతో ఊపు

ప్రధాని మోదీ మూడు రోజుల పాటు ప్రచారం నిర్వహించారు. హైదరాబాద్ లో నిర్వహించిన రోడ్ షో పై దేశవ్యాప్తంగా ఆసక్తి ఏర్పడింది. యోగి ఆదిత్యనాథ్ దగ్గర నుంచి ఏక్ నాథ్ షిండే వరకూ అనేక మంది వచ్చి ప్రచారాలు చేశారు. ఎక్కడ ప్రచారం ఎఫెక్టివ్ గా ఉంటుందో అక్కడే ప్రచార షెడ్యూల్ ఏర్పాటు చేశారు. యోగి ఆదిత్యనాథ్ రోడ్ షోలకు పెద్ద ఎత్తున జన స్పందన వచ్చింది. మొత్తంగా ప్రచార ఆర్భాటం పక్కన పెడితే.. నేరుగా ఓటర్లను ప్రభావితం చేయగలిగే ప్రచారంలో బీజేపీ మొదటి స్థానంలో ఉందని అనుకోవచ్చు.