జూబ్లీహిల్స్ లో బీజేపీ సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా నియోజకవర్గంలో రాజకీయం అనూహ్యంగా మారిపోయింది. ఈసారి బీజేపీ గట్టిపోటీ ఇస్తోంది. ఈ నియోజకవర్గంలో కమలం పార్టీ ఎప్పుడూ బలంగానే ఉంది. కానీ ఓటింగ్ సమయంలో సరైన ఎలక్షనీరింగ్ చేయకపోవడం వల్ల సమస్యలు వస్తుననాయి. బ్యాలెట్ బాక్స్ లో ఓట్లు పడేవి కావు. అయితే 2021లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంకు అనూహ్యంగా పుంజుకుంది.
గ్రేటర్ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థి
గ్రేటర్ ఎన్నికల్ోల నియోజకవర్గంలోని ఏ డివిజన్‌లోనూ గెలవకపోయినా.. మెజారిటీ స్థానాల్లో రెండో స్థానంలో నిలిచిన పార్టీగా సుమారు 45 వేల పైచిలుకు ఓట్లను సాధించింది. దీంతో ఆ ఉత్సాహాన్ని అసెంబ్లీ ఎన్నికల్లోనూ కనబరిచి నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ భావిస్తోంది. టీడీపీలో గతంలో వివిధ పదవులు నిర్వహించిన లంకల దీపక్‌రెడ్డి మూడేళ్ల క్రితం బీజేపీలో చేరి జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై దృష్టి సారించారు. దీంతో ఆయననే పార్టీ బరిలోకి దించింది. ప్రధానంగా సెటిలర్లు, హిందువుల ఓట్లపై దీపక్‌రెడ్డి నమ్మకం పెట్టుకున్నారు. ఆయనకు విస్తృతమైన మద్దతు లభిస్తోంది.
మజ్లిస్ పోటీతో బీఆర్ఎస్కు గండం
మరోవైపు తమ సీట్ల సంఖ్యను పెంచుకునే దిశగా ఎంఐఎం ఈసారి జూబ్లీహిల్స్పైగా గురిపెట్టింది. షేక్‌పేట డివిజన్ నుంచి రెండుసార్లు కార్పొరేటర్‌గా గెలిచిన రషీద్ ఫర్రాజుద్దీన్ను బరిలోకి దించింది. మైనారిటీలు పూర్తిగా తమవైపు మొగ్గితే గెలుపు తమదేనని భావిస్తోంది. కానీ మైనారిటీ ఓట్లను చీలిపోవడం కూడా బీజేపీకి లాభం కలుగుతుందని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా మైనార్టీ అభ్యర్థిని రంగంలోకి దించింది.
అజారుద్దీన్ కు ఓటేస్తే కనిపిస్తారా ?
జూబ్లీహిల్స్ సీటును దక్కించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ప్రయోగాత్మకంగా మాజీ క్రికెటర్ అజరుద్దీన్‌కు బరిలోకి దించింది. కానీ ఆయనకు ఓటేస్తే ఐదేళ్ల పాటు కనిపించే అవకాశం ఉండదని అక్కడి ప్రజలకుు తెలుసు. అందుకే పెద్దగా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్‌రెడ్డి కాంగ్రె్‌సను వీడి తన వర్గంతో కలిసి బీఆర్ఎస్ చేరారు. దీంతో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా మారింది.