బెంగాల్ లో బయటపడిన మరో స్కామ్..

మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం స్కాముల పుట్టగా మారింది. రోజుకో అవినీతి ఆరోపణ దీదీ ప్రభుత్వంపై వినిపిస్తూనే ఉంది. ఏ స్కీము అయినా స్కామ్ లేకుండా జరిగే ప్రసక్తే లేదని తెలిపోతోంది. పాత స్కాములు కూడా ఇప్పుడు ఒకటొకటిగా బయట పడుతున్నాయి..

కొవిడ్ కిట్స్ లో తృణమూల్ చేతివాటం..

కరోనా టైమ్ లో వైరస్ నివారణ చర్యలు చేపట్టిన మమత ప్రభుత్వం వందల కోట్లు స్వాహా చేసినట్లు తేలిపోయింది. దీనికి సంబంధించి బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు లేఖ రాశారు. 2020, 2021 రెండు కొవిడ్ వేవ్స్ సందర్భంగా పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్వీప్ మెంట్ (పీపీఈ) కిట్స్ కొనుగోలులో అవకతవకలు జరిగాయి.దీనికపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ దర్యాప్తు జరపాలని ఆయన కోరారు. కరోనాపై పోరాటంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు విడదల చేసిందని, కిట్స్ కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్లు తినేసిందని ఆయన ఆరోపించారు. కరోనా నియంత్రణా చర్యల్లో బిజీగా ఉన్న కేంద్రం అప్పట్లో స్కాములపై దృష్టి పెట్టలేదని ఇప్పటికైనా గట్టిగా పట్టుబట్టి నిందితులను న్యాయస్థానం ముందు నిలబెట్టాలని ఆయన కోరుతున్నారు.

ముంబై తరహా స్కామ్..

కొవిడ్ టైమ్ లో మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ఉండేది. అప్పుడు ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరాకు సంబంధించిన స్కామ్ ఒకటి విచారణలో ఉంది. అసలు రేటు కంటే 60 శాతం ఎక్కువ చెల్లించి ఆక్సిజన్ సిలెండర్లు కొనుగోలు చేశారు. ఇప్పుడు సువేందు అధికారి, అదే స్కామును ప్రస్తావిస్తూ బెంగాల్ అధికార పార్టీపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ అభ్యర్థన మేరకు ఈడీ అధికారులు మమత అనుచరులపై ఫిర్యాదు నమోదు చేసే అవకాశం ఉంది. దానితో తర్వాత చర్యలు వేగవంతమవుతాయి.

గతంలో ఉపాధి హామీ ఫేక్ జాబ్ కార్డ్స్ స్కామ్

గతంలో కూడా మమత ప్రభుత్వం చాలా స్కాములే చేసింది. కేంద్రప్రభుత్వ నిధులతో నిర్వహించే గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో భారీ స్థాయి అవినీతి జరిగిందని అప్పట్లో గుర్తించారు. 25 లక్షల నకిలీ జాబ్ కార్డులు సృష్టించి నిధులు స్వాహా చేశారని కేంద్ర ప్రభుత్వం జరిపిన ఆడిట్లో వెల్లడైంది. దీనిపై సీబీఐ విచారణకు సిఫార్సు చేశారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత బెంగాల్ కు రూ.2.5 లక్షల కోట్లు విడుదల చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రూ.54 వేల కోట్లు ఇస్తే అవి దుర్వినియోగమయ్యాయి. ఎక్కువ గృహాలు అర్హతలేని వారికి కేటాయించారని కేంద్ర బృందం సర్వేలో తేలింది. జూన్ 2023లో విడుదలైన కాగ్ నివేదిక కూడా బెంగాల్ ప్రభుత్వ తీరును తప్పుపట్టింది. ప్రభుత్వ స్కీముల అమలు తీరుపై ఎలాంటి ఆడిట్ నిర్వహించలేదని కాగ్ గుర్తించింది. గ్రామీణాభివృద్ది శాఖ నిర్వహించిన ఫీల్డ్ ఎంక్వయిరీలో కూడా అనేక అవకతవకలు బయట పడ్డాయి. కేంద్రం సాయంతో నిర్వహించే 63 స్కీముల్లో 32 పథకాల పనితీరు సంతృప్తికరంగా ఉందని, మిగతా 31 పథకాల్లో తీవ్ర అవకతవకలు బయట పడ్డాయని గుర్తించారు. పెద్ద ప్రాజెక్టులను చిన్న ప్రాజెక్టులుగా మార్చి నిధులను మళ్లించుకోవడంలో మమత ప్రభుత్వం దిట్టగా మారిందని తేల్చారు.ఇప్పుడు తాజాగా బెంగాల్ ప్రభుత్వం చేసిన పీపీఈ కిట్స్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. దీనిపై ఎలాంటి విచారణ జరుగుతుందో చూడాలి…