పట్టుబడుతున్న వందల కోట్ల నగదు కాంగ్రెస్‌దే – డబ్బుతో గెలవగలరా ?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ డబ్బుతో విజయాన్ని కొనాలని చూస్తోంది. తెలంగాణలో ఎక్కడ చూసినా పట్టుబడుతున్న నగదు కాంగ్రెస్ పార్టీ నేతలకు చెందినవేనని పోలీసులు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ బడా పారిశ్రామికవేత్త…. పెద్దపల్లి జిల్లాకు చెందిన మరో పారిశ్రామికవేత్త వందలకోట్లలో నగదును తెలంగాణ మొత్తం వెదజల్లుతున్నారు. వీరికి తోడు ఇతర నియోజకవర్గాల అభ్యర్థులదీ అదే పని. వీరికి ఇంత డబ్బు ఎక్కడ్నుంచి వస్తోంది ? గెలిచిన తర్వాత అంతకు పదింతలు ప్రజల్ని దోచుకోరా అన్నది సగటు ఓటర్ కు వస్తున్న ప్రశ్న.

కాంగ్రెస్ ధన ప్రవాహనం

సాధారణంగా బ్యాంకుల్లోనే నోట్ల కట్టల బండిల్స్ చూస్తాం. కానీ ఇప్పుడు హైదరాబాద్ రోడ్లపైనే కాదు.. మరుమూల నియోజకవర్గాల్లోనూ పెద్ద ఎత్తున నోట్ల కట్టలు కనిపిస్తున్నాయి. పోలీసులు కాంగ్రెస్ నేతలకు చెందిన కార్లను తనిఖీ చేస్తే చాలా కట్టల పాములు బయటకు వస్తున్నాయి. విజయం కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతకైనా తెగిస్తోందని ఈ నోట్ల కట్టలను బట్టి చూస్తే అర్థమైపోతుంది. ఈ సొమ్మంతా ఎక్కడి నుంచి వస్తుందన్నది మాత్రం సీక్రెట్ గానే ఉంది. గెలుపును కొనాలని కాంగ్రెస్ చాలా ముందుగానే ప్లాన్ చేసుకుందని ఈ పరిణామాల ద్వారా స్పష్టమవుతోందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

పట్టుబడని డబ్బు ఎన్ని వందల కోట్లో ?

హైదరాబాద్ నుంచి వరంగల్ కు వెళ్తున్న ఓ కారు.. దారి మధ్యలో ఇంజిన్ లో మంటలు రావడంతో ఆగిపోయింది. ఇంజిల్ మంటలు ఎందుకు వచ్చాయంటే… డబ్బు సంచలు ఇంజిన్ దగ్గర పెట్టి తరలిస్తున్నారు. ఈ కారణంగా మంటలు వచ్చాయి. వెంటనే వేరే కారులో నగదు తరలించేశారు. అప్పటికీ కొంత సొమ్ముతగలబడిపోయింది. ఇది పోలీసుల తనిఖీల్ని తప్పించుకున్న నగదు. ఇలా ఎన్ని వందల కోట్లు నియోజకవర్గాలకు వెళ్లిపోతుందో అంచనా వేయడం కష్టంగా మారింది. పోలీసుల కళ్లు గప్పి మరీ ఓట్ల కొనుగోలు కోసం వేల కోట్లు ఖర్చు చేసేందుకు కాంగ్రెస్ వెనుకాడని పరిస్థితి ఉంది.

ప్రజలు ఫిర్యాదులు చేయడానికి సీ విజిల్ యాప్

కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యానికి హానికరంగా మారిందని.. వందల కోట్లు పెట్టి ఓట్లు కొనాలని చేస్తున్న ప్రయత్నాలను నిర్వీర్యం చేయాలని ఇతర పార్టీలు పిలుపునిస్తున్నాయి. ఈసీ సీ విజిల్ అనే యాప్ ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. దీని వల్ల డబ్బు పంపిణీపై పూర్తి స్థాయిలో ఫోటోలు, వీడియోతో సహా ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఉపయోగించుకుని కాంగ్రెస్ కుట్రలు బట్టబయలు చేయాలని ఇతర పార్టీల నేతలు ప్రజలకు పిలుపునిస్తున్నారు.