చలికాలంలో గుండె సమస్యలు అధికం..ఈ జాగ్రత్తలు తీసుకోకతప్పదు!

గుండెజబ్బులు వయసుతో సంబంధం లేకుండా అటాక్ చేస్తున్నాయి. ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య మరింత పెరుగుతుంది. చలి తీవ్రత కేవలం గుండెజబ్బులను మాత్రమే కాదు చాలా వ్యాధులను తెచ్చిపెడుతుంది. ఈ సీజన్లో వాయుకాలుష్యం విపరీతంగా పెరిగి గాలి విషతుల్యమవుతుంది. శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. కాలుష్యాన్ని తగ్గించడం కోసం ప్రపంచ దేశాలు చర్చిస్తున్నాయి. కానీ వారు తీసుకునే నిర్ణయాలు ఆచరణలో సాధ్యంకావడం లేదు. వాయుకాలుష్యం వల్ల శ్వాసకోశ వ్యాధుల ప్రమాదం పెరగడమే కాకుండా గుండెపై ఎఫెక్ట్‌ పడుతోంది. ఇలాంటి వ్యాధుల నుంచి బయటపడాలంటే మన జీవనశైలి, ఆహారం మార్చుకుంటే చాలంటున్నారు ఆరోగ్య నిపుణులు..

వ్యాయామం
చెడు ఆహారం, మానసిక ఒత్తిడి హృదయ స్పందనల వేగాన్ని తగ్గిస్తుంది. గుండె రక్తాన్ని పంప్ చేసి శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే బరువును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. అందుకే రోజూ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి.

డ్రై ఫ్రూట్స్‌
డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు కానీ దానికి ఓ పరిమితి ఉండాలి. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్‌లో అధిక మొత్తంలో కేలరీలు ఉంటాయి. ఇవి గుండె రోగులకు, మధుమేహ రోగులకు హానికరం. కాబట్టి డ్రై ఫ్రూట్స్‌ను పరిమిత పరిమాణంలో తీసుకోవడం ఉత్తమం.

ఆకుకూరలు
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే పొటాషియం చాలా ముఖ్యం. ఇది రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తక్కువగా ఉంచుతుంది. చలికాలంలో పాలకూరతో సహా ఆకు కూరలు తీసుకోవాలి. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

మద్యపానం, ధూమపానం
మద్యపానం, ధూమపానం గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. చలి కాలంలో గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి. అర్జున్ బెరడు, గ్రీన్‌ టీ వంటివి తాగాలి. ఇవి గుండెకు ప్రాణం పోస్తాయి.

మాంసాహారం వద్దు
చలికాలంలో మాంసాహారాలకు దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే వీటిలో ఉండే అధిక కొలెస్ట్రాల్‌ గుండెపోటుకు కారణమవుతుంది. కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ప్రతిరోజు శరీరానికి కావాల్సిన నీరు అందించాలి. దీనివల్ల విసర్జన వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది.

నూనెలు
రిఫైన్డ్ ఆయిల్ గుండెకు హాని చేస్తాయి. అందుకే ఆలివ్ ఆయిల్, వేరుశెనగ ఆయిల్‌ తో చేసిన ఆహార పదార్థాలు తింటే గుండెకు ఆరోగ్యకరం. అయితే నూనె ఏది అయినా హృదయానికి హాని చేస్తుంది. అందువల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే నూనె తీసుకోవడం మానేయండి.

సోడా
సోడా అనేది గుండె ఆరోగ్యానికి హాని కలిగించే పానీయం. అందువల్ల హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే పొరపాటున కూడా సోడా తాగకూడదు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.