తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి రాను రాను దిగజారిపోతోందన్న అభిప్రాయాన్ని ఆ పార్టీ నేతలే వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ వాయిస్‌గా చెబుతున్న ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో స్థానిక నేతలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ వ్యవహరిస్తున్నపుడు రికార్డైన ఆడియోగా చెబుతున్నారు. స్థానిక నాయకులు జాగ్రత్తగా ఉండాలని, ఇంటింటికీ వెళ్లాలని కేటీఆర్ అభ్యర్థిస్తున్నారు. మెజారిటీ తగ్గుతుందని, తన ప్రత్యర్థి చాలా బాగా ప్రచారం చేస్తున్నారని, కొన్ని కులాలు తనకు ఓటేయడం లేదని, బీఆర్ఎస్ నేతలపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు ఆడియోలో అర్థమవుతోంది.
ఖండించలేదు అది కేసీఆర్ రియల్ వాయిసే
బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతోందని మన పార్టీ నేతలే కొందరు చెబుతున్నట్లు తన వద్దకు విషయం చేరిందని చెప్పినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఎన్నికల వ్యూహాల్లో ఇదంతా భాగమని చెప్పుకొచ్చారు. ఎవరో కేటీఆర్ సిరిసిల్లలో ఓడిపోతున్నారని రాసారని..మనలో అందరూ కలిసికట్టుగా భారీ మెజార్టీ లక్ష్యంగా పని చేయాలని సూచించారు. ఈ వారం రోజులు ఎవరైనా ఏవైనా చిన్ని చిన్న సమస్యలు ఉన్నా..మెజార్టీ కోసం పని చేయాలని నిర్దేశించారు. తాను ఇక నుంచి ఖచ్చితంగా నియోజకవర్గ కేడర్ కు అందుబాటులో ఉంటానని స్పష్టం చేసారు. రాష్ట్రం మొత్తం సిరిసిల్లలో వచ్చే మెజార్టీ పైనే చూస్తుందని..ఎవరూ ఏ మాత్రం నిర్లక్ష్యం గా ఉండవద్దని సూచించారు. ప్రజలను సంచాయించుకోకపోతే నష్టపోతామని హెచ్చరించారు. ఈ వాయిస్ వైరల్ అయినా కేటీఆర్ ఖండించలేదు. అంటే నిజమేనని కేటీఆర్ అంగీకరించినట్లయింది.
గట్టి పోటీ ఎదుర్కొంటున్న కేటీఆర్
ఎన్నికల సమయం దగ్గర పడుతున్నప్పటికీ సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్లో అసంతృప్తులు ఏమాత్రం చల్లారడం లేదు. ఇక్కడంతా జరుగుతున్నా, అధిష్టానం మాత్రం జోక్యం చేసుకోవడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీలో ఉన్న నేతలు సైతం ప్రచారంలో కలిసిరావడం లేదు. కేసీఆర్ కు సిరిసిల్లో వ్యక్తిగత బలం లేదు. ఉద్యమ బలం మాత్రమే ఉంది. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి తొలిసారిగా 2009లో పోటీ చేశారు కేటీఆర్. సమీప ప్రత్యర్థి కేకే మహేందర్ రెడ్డి చేతిలో కేవలం 171 ఓట్ల తేడాతోనే గెలిచారు. అలా అసెంబ్లీ వరకు వచ్చారు కేటీఆర్. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితికి వచ్చారన్న ప్రచారం జరుగుతోంది.
గట్టి పోటీ ఇస్తున్న రాణి రుద్రమ
మీడియాలో పని చేసి మంచి పేరు తెచ్చుకున్న రాణి రుద్రమ బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆమె ఇటీవలి కాలంలో చురుగ్గా పని చేస్తున్నారు. అయితే స్థానికేతర నేతకావడంతో కాస్త వివాదం ఏర్పడింది. బండి సంజయ్ చొరవతో అందరూ కలిసి పని చేస్తున్నారు. దీంతో ఆమె గట్టి పోటీ ఇస్తున్నారని … ఫలితం ఎలా అయినా ఉండవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి.