తల్లి కాబోతున్న సమంత – గొప్ప నిర్ణయమే ఇది!

నాగచైత్యను ప్రేమ వివాహం చేసుకుని విడాకులు తీసుకుని సింగిల్ గా ఉన్న సమంత షాకింగ్ డెసిషన్ తీసుకుందట. ఇప్పటికే సామ్ మూవీస్ కి పూర్తిగా గుడ్ బై చెప్పేస్తుందనే వార్తలు వైరల్ అవుతుంటే..ఇప్పుడామే వ్యక్తిగత జీవితం గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది..

సమంత.. స్టార్ హీరోయిన్ గా సౌత్ లో ఓ వెలుగువెలిగింది. కోలీవుడ్ లోనూ దూకుడు సాగించింది. పెళ్లయ్యాక దూకుడు తగ్గిస్తుందనుకుంటే మరింత జోరు పెంచింది. విడాకుల తర్వాత తగ్గేదే అన్నట్టు స్పెషల్ సాంగ్స్ లోనూ మెరిసింది.అనారోగ్య కారణాలతో ఖుషి మూవీ తర్వాత నుంచి బ్రేక్ తీసుకున్న సమంత..త్వరలోనే రీఎంట్రీ ఇస్తుందనే ఆశతో ఉన్నారు ఫ్యాన్స్. అయితే ఆమె ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి బిజినెస్ లో బిజీ అవుతుందనే వార్తలొస్తున్నాయి. ఇందులో నిజమెంతో తెలియదు కానీ ప్రస్తుతం ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి మరో న్యూస్ వైరల్ అవుతోంది.

అమ్మ అవుతానంటున్న సమంత
ఓ వైపు సింగిల్ లైఫ్ ను లీడ్ చేస్తున్న సామ్ కు మళ్లీ పెళ్లి చేయాలని తల్లి ఆలోచిస్తుంటే..సామ్ మాత్రం నో అనేసిందట. జీవితంలో మళ్లీ పెళ్లి చేసుకోకూడదని డిసైడైన సమంత మిగిలిన జీవితాన్ని సామాజిక కార్యక్రమాలు చేస్తూ గడిపేయాలని డిసైడైందట. ఇంకోవైపు తల్లి కావాలన్న తన కోర్కెను నెరవేర్చుకునేందుకు ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకోవాలని అనుకుంటోందట. దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ లేదు కానీ సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవుతోంది.

సామాజిక కార్యక్రమాల్లో సామ్ బిజీ
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే సామ్..సామాజిక కార్యక్రమాల్లోనూ తనవంతు సహాయం చేస్తుంటుంది. 11 ఏళ్లుగా ప్రత్యూష ఫౌండేషన్ పేరుతో ట్రస్ట్ రన్ చేస్తోంది. మహిళలు ఆడపిల్లల సంక్షేమానికి కృషి చేస్తోంది. అదే బాటలో ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకుని అమ్మగా వారి ఆలనా పాలనా చూసుకోవాలనుకుంటోందట. సమంత మంచి మనసుకి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్.

నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడో మరి!
ఇక ఆమె మూవీస్ విషయానికొస్తే.. ఖుషి తర్వాత మరో ప్రాజెక్ట్ కి సైన్ చేయలేదు. చివరిగా సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సిరీస్ వచ్చే ఏడాది అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక టాలీవుడ్ లో పుష్ప 2లోనూ ఐటెం సాంగ్ చేస్తుందనే ప్రచారం జరిగింది కానీ ఆ ప్లేస్ లోకి ఊర్వశి రౌతేలా వచ్చి చేరిందని టాక్. మరి సామ్ తర్వాతి ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తుందో..లేదంటే బిజినెస్ & సామాజిక కార్యక్రమాల్లో బిజీ అయిపోతుందో వెయిట్ అండ్ సీ..