కాషాయం దిశగా కోల్ బెల్ట్ – కాంగ్రెస్, బీఆర్ఎస్ పై ఆశలు కోల్పోయిన సింగరేణి కార్మికులు

తెలంగాణలో ప్రధాన ఆదాయ వనరు, దేశానికి వెలుగులు పంచడంలో బొగ్గు ఉత్పత్తి చేస్తున్న కోల్‌బెల్ట్‌ ప్రాంతం ఎన్నికల్లో కీలకం కానుంది. తెలంగాణలో విస్తరించి ఉన్న సింగరేణి ప్రాంతంపై ఆధారపడి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి పొందుతున్న వారు, కుటుంబ సభ్యులు సుమారు 6 లక్షల మంది వరకు ఉంటారు. వీరు ఈ ప్రాంతం నుంచి పోటీచేసే ప్రతి అభ్యర్థి గెలుపునూ ప్రభావితం చేయనున్నారు. అధికారం ఇంత కాలం అనుభవించిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మోసం చేయడంతో కార్మికులు రగిలిపోతున్నారు.

బీఆర్ఎస్ దోపిడీని అడ్డుకుంటున్న కేంద్రం

తెలంగాణలోని ప్రభుత్వ సంస్థయైన ‘సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌’లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండూ వాటాదారులే. రాష్ట్రంలోని గోదావరి, ప్రాణహిత లోయ ప్రాంతంలో 350 కిలోమీటర్ల విస్తీర్ణంలో బొగ్గు గనులు ఉండటంతో ఈ ప్రాంతాన్ని కోల్‌బెల్ట్‌ ఏరియాగా పిలుస్తారు. అయితే రాష్ట్రానికి 51 శాతం వాటా ఉండటంతో నిర్ణయాలు, పరిపాలన అంతా బీఆర్ఎస్ సర్కార్ చేస్తోంది. . సింగరేణిలో ప్రస్తుతం సుమారు 42 వేల మంది కార్మికులుండగా, 20 వేల మంది వరకు కాంట్రాక్ట్‌ కార్మికులు పనిచేస్తున్నారు. 60 వేల మందికిపైగా రిటైర్డ్‌ ఉద్యోగులు ఉన్నారు. గతంలో 2 లక్షలకు పైగా ఉన్న కార్మికుల సంఖ్య రానురాను తగ్గుతూ 42 వేలకు చేరుకుంది. ఈ కారణంగానే సింగరేణి మనుగడ ప్రమాదంలో పడుతోందని కార్మిక వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ పరిస్థితిని కేంద్రం ఎప్పటికప్పుడు కాపాడే ప ్రయత్నం చేస్తోంది.

కార్మికలకు ఇన్ కంట్యాక్స్ మినహాయింపు ఇస్తామని బీజేపీ హామీ

అసెంబ్లీ ఎన్నికలలో సింగరేణి కార్మికుల కుటుంబాల ఓట్ల కోసం అన్ని పార్టీలూ ప్రయత్నాలు చేస్తున్నాయి. సింగరేణిలో ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులతో పాటు పెన్షనర్ల కుటుంబాల ఓట్లూ ఇక్కడి నియోజకవర్గాలలో గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. అందుకే అన్ని పార్టీలూ వారి సమస్యలపై మాట్లాడుతున్నాయి. సింగరేణి సంస్థను కాపాడింది, వారికి మేలు చేసింది కేంద్రమే. సుదీర్ఘ కాలంగా వేతన సవరణ అమలు కాకపోవడంతో పాత పింఛన్లే వస్తున్నాయి. కోల్‌మైన్స్‌ ప్రావి డెంట్‌ ఫండ్‌ లో సమస్యలున్నాయి. వీటి పరిష్కారంతో పాటు ఇన్ కంట్యూక్స్ మినహాయింపు ఇస్తామని బీజేపీ హామీ ఇస్తోంది.

కార్మికుల్ని మోసం చేసిన బీఆర్ఎస్

ఒక్క రోజు సర్వీస్‌ మిగిలి ఉన్నవారికి సంబంధించి కూడా కారుణ్య నియామకాలు కల్పిస్తామని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ నెరవేరలేదు. కొత్త భూగర్భ గనులు ఏర్పాటు చేయించి లక్ష మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి పదేండ్ల కాలంలో ఒక్క గని కూడా ప్రారంభం కాలేదు. డిపెండెంట్‌ ఉద్యోగాల భర్తీ తేలలేదు. సొంతింటి పథకం కోసం ఎదురు చూస్తున్నారు. రెండేండ్లకోసారి నిర్వహించాల్సిన గుర్తింపు ఎన్నికలు ఆండ్లయినా నిర్వహించలేదు. దీంతో కార్మికుల సమస్యలపై మాట్లాడేందుకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏమీ చేయలేదు కాబట్టి ఈ సారి .. బీజేపీకి చాన్సిచ్చే ఆలోచన అక్కడి కార్మిక వర్గాల్లో ఉంది.